BigTV English

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి డైరెక్షన్ టీమ్‌లో ఆ టాప్ హీరో కొడుకు.. త్రివిక్రమ్ అలా సెట్ చేశాడా?

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి డైరెక్షన్ టీమ్‌లో ఆ టాప్ హీరో కొడుకు.. త్రివిక్రమ్ అలా సెట్ చేశాడా?

Sandeep Reddy Vanga : ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని చెప్తాడు పూరి జగన్నాథ్ పోకిరి సినిమాలో.. రియల్ లైఫ్ లో ఒక దర్శకుడు ఇది ప్రూవ్ చేశాడు. అతను మరెవరో కాదు సందీప్ రెడ్డి వంగ. ఇది కేవలం పేరు కాదు ఇది ఒక బ్రాండ్ అని చెప్పాలి. సినిమా అంటే ఇలానే ఉండాలి, ఇంతసేపే ఉండాలి, ఇన్ని పాటలు ఉండాలి, కమర్షియల్ ఫైట్లు ఉండాలి ఇలాంటివన్నీ కాకుండా సినిమాని ఇలా కూడా చెప్పొచ్చు అని ఒక కొత్త రకమైన సినిమా అనుభూతిని ప్రేక్షకుడికి అందించాడు సందీప్ రెడ్డి వంగ. ఒక మామూలు కథను కూడా చాలా ఆసక్తికరంగా చెప్పడం సందీప్ రెడ్డికి పెన్నుతో పెట్టిన విద్య. సందీప్ రెడ్డి స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సందీప్ రెడ్డి ఎడిటింగ్ సినిమాని ఇంకో రేంజ్ కి తీసుకెళ్తుంది. సందీప్ రెడ్డి మ్యూజిక్ సెన్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాను చాలామందికి మొదట చెప్పాడు. కానీ సినిమా పట్టాలెక్కలేదు. ఏదైతే అది అయిందని ఫ్యామిలీని రిస్క్ లో పెట్టి సొంత అన్నయ్యని నిర్మాతగా మార్చేసాడు. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలకి గురైంది. నన్ను ఇక్కడ ఆపితే హాలీవుడ్ కి వెళ్లి సినిమాలు చేస్తాను అంటూ అప్పట్లోనే రిప్లై ఇచ్చాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెనక్కి చూడాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇదే సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో తీసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కబీర్ సింగ్ సినిమాను చాలామంది రివ్యూ రైటర్స్ చాలా తక్కువగా చేసి మాట్లాడారు, కానీ ఆడియన్స్ మాత్రం 200 కోట్లకు పైగా కలెక్షన్లు ఇచ్చారు. కబీర్ సింగ్ సినిమాను వైలెంట్ ఫిలిం అంటూ చెప్పుకొచ్చారు. అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ అనిమల్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

సౌత్ ఇండియాలో సందీప్ రెడ్డి వంగ అంటేనే ఒక బ్రాండ్. అయితే ఇటువంటి దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడానికి చాలామంది ఆసక్తి చూపడం మామూలు విషయమే. అయితే కొంతమంది సెలబ్రిటీల కొడుకులు కూడా సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే రవితేజ కొడుకు కూడా సందీప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇంతే కాకుండా చాలామంది పొలిటిషియన్స్ కొడుకులు కూడా సందీప్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ పనిచేస్తున్నట్లు సమాచారం.


Also Read : Monalisa : పాపం మోనాలిసా… మహా కుంభమేళా వైరల్ గర్ల్ మూవీ ఆగిపోయిందా?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×