Pistachios: పిస్తా ఒక రుచికరమైన, పోషకాలు పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్. పిస్తాలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. పిస్తా పప్పులు తినడం వల్ల ఉత్సాహంగా ఉండటం మాత్రమే కాకుండా, శరీరం యొక్క అనేక ముఖ్యమైన విధులను నిర్వహించడంలో కూడా ఇవి మేలు చేస్తాయి. ప్రతి రోజూ పిస్తా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పిస్తా తినడం వల్ల గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ , జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పిస్తా పప్పులు తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిస్తా పప్పులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
పిస్తాలు మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి “చెడు” కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడానికి , “మంచి” కొలెస్ట్రాల్ (HDL)ను పెంచడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పిస్తాపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
పిస్తా తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ , ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రెండు ఆకలిని ఎక్కువ కాలం అదుపులో ఉంచుతాయి. తద్వారా అతిగా తినే అవకాశాలను తగ్గిస్తాయి. పిస్తాలన చిరుతిండిగా తినడం వల్ల మీరు సంతృప్తి చెందుతారు. ఫలితంగా మీ బరువును నిర్వహించడం సులభం అవుతుంది.
3. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
పిస్తాలో విటమిన్ ఎ , జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఈ అంశాలు దృష్టిని మెరుగుపరచడానికి , కళ్ళను పునరుజ్జీవింపజేయడానికి పనిచేస్తాయి. పిస్తాపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల కంటిశుక్లం , రెటీనా సమస్యలను నివారించవచ్చు.
4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పిస్తాపప్పులలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకండా ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మలబద్ధకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా, సరిగ్గా పనిచేయడానికి ఫైబర్ చాలా అవసరం.
5. చర్మానికి మేలు:
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పిస్తాలో ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి చర్మ కణజాలాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతలు ,వృద్ధాప్య ప్రభావాల నుండి రక్షిస్తాయి. పిస్తా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కణాలను పునరుద్ధరించడానికి, తేమగా మార్చడానికి సహాయపడతాయి.
Also Read: ముఖంపై మంగు మచ్చలా ? ఇది వాడితే.. ప్రాబ్లమ్ సాల్వ్
6. మెదడు పనితీరు:
పిస్తా పప్పులలో విటమిన్ B6 , ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇవి మానసిక పనితీరును ప్రేరేపిస్తాయి. పిస్తా పప్పులు తినడం వల్ల మానసిక అలసట తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కోసం కూడా పిస్తా చాలా బాగా ఉపయోగపడుతుంది.