Gautam Menon :ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Vasudev menon) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తక్కువ బడ్జెట్ తో.. వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అని చెప్పవచ్చు. అలాంటి ఈయన తాజాగా తమిళ చిత్ర పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అధిక బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టడం కంటే మంచి కథలతో సినిమాలు తీయాలని, కానీ తమిళ నటులకు కథలు అవసరం లేదు అని చెప్పి సంచలన కామెంట్లు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు.
కోలీవుడ్ ఇండస్ట్రీపై డైరెక్టర్ కామెంట్స్..
గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ( Gautham vasudev menon) యాక్టర్ గా, డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ప్రయాణాన్ని సాగించారు. అయితే ఈ మధ్యకాలంలో అవకాశాల విషయంలో వెనుకబడిన ఆయన డైరెక్టర్ గా చేయడం మానేశారు. ఫలితం తనకు హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదనే వార్త కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కోస్తోంది. దాంతో చేసేదేమీ లేక పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ పరిశ్రమపై మండిపడుతూ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి తోడు పైగా తన మాటలు విన్న తర్వాత తమిళ పరిశ్రమ తనకు అవకాశాలు ఇవ్వకపోవచ్చు అని, తనపై బ్యాన్ విధించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.
కోలీవుడ్ నటులకు కథ అవసరం లేదు, బడ్జెట్ ముఖ్యం..
ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న మలయాళ చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’. మమ్ముట్టి(Mammutty) ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. రేపు అనగా జనవరి 23వ తేదీన గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ” వాస్తవానికి ఏ సినిమాకైనా సరే భారీ బడ్జెట్ అవసరం లేదు. రూ.100 కోట్లు పెట్టి సినిమా తెరకెక్కించడం కంటే రూ.10 కోట్ల బడ్జెట్ తో పది సినిమాలు నిర్మించడంపై ఫోకస్ చేస్తే, ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతుందని” తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. “చాలామంది తమిళ్ నటులకు స్క్రిప్ట్ తో సంబంధం లేదు. ఎక్కువ బడ్జెట్ సినిమా అంటే చాలు నటించడానికి ఎగబడతారు. చిన్న పెద్ద హీరోలతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ కూడా భారీ బడ్జెట్ చిత్రాలని కోరుకుంటున్నారు. ఎవరికి కూడా కథ పైన ఆసక్తి లేదు. నాకు ఒక అవకాశం కల్పిస్తే.. కథలతో మొదలు ప్రతి విషయాన్ని కూడా నేను బాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొస్తాను. ముఖ్యంగా ఆ కథల్లో సగానికి పైగా సినిమాలు తమిళంలో కూడా తెరకెక్కించబడవు. మలయాళంలో సక్సెస్ అయితే దానిని తమిళ్ వాళ్ళు రీమేక్ చేస్తారు. కానీ తమిళ్ యాక్టర్లు ఒరిజినల్ స్క్రిప్ట్ చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధం కారు. నేను చేసిన ఈ కామెంట్స్ నాకు మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తాయని, నేను అనుకోవడం లేదు” అంటూ తెలిపారు గౌతంమీనన్. ప్రస్తుతం ఈయన చేసిన ఈ హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.