BigTV English

US Birthright Citizenship : యూఎస్ పౌరసత్వం రద్దు.. లక్షల మంది భారతీయులు ఎలా నష్టపోనున్నారంటే..

US Birthright Citizenship : యూఎస్ పౌరసత్వం రద్దు.. లక్షల మంది భారతీయులు ఎలా నష్టపోనున్నారంటే..

US Birthright Citizenship : ఎన్నికల ప్రచార సమయం నుంచి అక్రమంగా దేశంలోని అడుగుపెట్టిన వారిని తిరిగి పంపించేయాల్సిందే అన్న ట్రంప్.. అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే అందుకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వందేళ్లుగా అమెరికా రాజ్యాంగం అందిస్తున్న పుట్టుకతో పౌరసత్వాన్ని.. ఒక్క కలం పోటుతో రద్దు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై.. తాత్కాలిక వీసాలతో అమెరికాలో అడుగుపెట్టి.. అక్కడే బిడ్డను కంటామంటే కుదరదని, అలాంటి పిల్లలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదంటూ ట్రంప్ కరాఖండిగా చెప్పారు. దీంతో.. కోటి ఆశలతో ఆదేశంలో ఉంటున్న భారతీయ అమెరికన్ల గుండెళ్లో పిడుగు పడినంత పనైంది. ఏళ్లుగా పౌరసత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, చూస్తున్న ఎదురు చూపుల మధ్య.. ప్రస్తుత ప్రకటన వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా భారతీయులపై ఎలాంటి ప్రభావం పడనుందంటే..


అమెరికా ధర్మసత్రం కాదు.. కేవలం నిపుణుల్ని మాత్రమే దేశంలోని రానిస్తాం. వారి అవసరాలు మాకు కావాలి, మేమందించే సౌకర్యాలు వాళ్లకు కావాలి. అంతే కానీ.. ఎలాగైనా వచ్చి అమెరికాలో పౌరసత్వం పొందుతాం అంటే చెల్లదంటూ.. నిర్మొహమాటంగా చెబుతున్నారు ట్రంప్. తన సహజ వ్యాపార ధోరణిలో.. అమెరికాకు లాభం ఉంటే సరేసరి, లేదంటే మరో మార్గం చూసుకోవడమే అంటున్నాడు. ఈ బిలియన్ డాలర్ల వ్యాపారవేత్త తాజా ప్రకటనతో.. ఇండో అమెరికన్ వర్గాలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నాయి. ఓ అంచనా ప్రకారం.. ప్రస్తుతం యూఎస్ లో సరైన పత్రాల్లేకుండా నివసిస్తున్న వారి సంఖ్య 1.40 కోట్లు. కాగా.. వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 7.25 లక్షల మంది. వీరెంరికీ అమెరికాలో నివసించేందుకు కావాల్సిన అర్హతా పత్రాలు లేవు.

అలాగే.. అమెరికాకు ఎక్కువగా అక్రమ వలసలతో ఇబ్బంది పెట్టే దేశాల్లో.. సరిహద్దు మెక్సికో, సాల్వెడార్‌ ముందు వరుసలో ఉంటారు. వారి తర్వాత ఎక్కువగా ఆదేశంలో అక్రమంగా నివసిస్తుంది భారతీయులే. గతేడాది బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో… ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 1.529 మంది ఇండియన్స్ ఆమెరికా వదిలి తిరిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు జాతీయవాద భావజాలం ఉన్న ట్రంప్‌ అధికార పీఠం ఎక్కడంతో.. పరిస్థితులు ఇంకా తీవ్రమవుతాయని అంచనా వేస్తున్నారు.


దాదాపు వందేళ్ల క్రితం.. అమెరికా 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ దేశ గడ్డపై పురుడుపోసుకున్న శరణార్థుల పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంటుంది. ఎంత మంది అధ్యక్షులు మారినా.. ఈ విధానాన్ని మాత్రం ఎవరూ మార్చలేదు. ఈ కారణంగా.. స్టూడెంట్ వీసాలపై ఆదేశానికి వెళ్లి అక్కడే పిల్లల్ని కంటూ ఉంటారు. ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లు సైతం.. అమెరికాలో పిల్లలు పుడితే వాళ్లకు పౌరసత్వం లభిస్తుందని కాన్పుకు స్వదేశానికి రాకుండా.. అక్కడే ఉండిపోతారు. స్టడీ వీసా అని, వర్క్ వీసా అంటూ.. ఆదేశంలోకి అడుగుపెట్టి.. ఎంతో పోటీలో నిరంతరం నలిగిపోతూ.. దశాబ్దాల తర్వాత కానీ గ్రీన్ కార్డు సాధించలేని వాళ్లకు.. పుట్టుకతో వారి పిల్లలకు వీసా కష్టాలు తీరిపోతాయనే ఉద్దేశ్యంతో కష్టమైనా అక్కడే పిల్లల్ని కంటుంటారు.

అయితే, తాజాగా ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వహక ఉత్తర్వులతో ఈ విధానానికి ముగింపు పలికింది. బిడ్డకు జన్మనిచ్చే టైంకి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోతే అసలు పౌరసత్వం రాదు. అలాగే.. ఒక వేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. అలాగే.. తండ్రి శాశ్వత నివాసి అయ్యి, తల్లి తాత్కాలికి వీసాపై ఉన్న సందర్భాల్లోనూ.. పిల్లలకు వీసా ఇవ్వలేమంటూ ట్రంప్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికా వీసా అంటే విపరీతంగా ఆసక్తి చూపించే భారతీయులకు ఈ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్నాయి. వాస్తవానికి అమెరికాకు ఇబ్బడిముబ్బడిగా తరలిపోతున్న భారతీయులు తిరిగి రావడం లేదు. అక్కడే పిల్లల్ని కంటూ.. అక్కడే ఉండిపోతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ తెలుపుతున్న వివరాల ప్రకారం.. 2024 చివరికి 54 లక్షల మంది భారతీయ అమెరికన్లు అక్కడ జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 34 శాతానికి పైగా.. అమెరికాలోనే పుట్టారంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఇక మిగతా వారంతా వలసదారులే అంటే నమ్మశక్యం కాదు. పైగా.. ఇండో అమెరికన్ జనాభా శాతం కూడా అమెరికా మొత్తం జనాభాలో భారీగా పెరిగిపోతుంది. ఓ నివేదిక ప్రకారం.. అమెరికా మొత్తం జనాభాలో భారతీయుల వాటా 1.47 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం.. తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు.

అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది భారతీయ దంపతులకు.. ఇప్పుడు వారి పిల్లలు సైతం పౌరసత్వం రాకపోవడంతో గ్రీన్‌ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. పైగా.. చాలా మంది ధనవంతులు వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం పిల్లల్ని కనే సమయానికి అమెరికా వెళుతుంటారు. దీనిని బర్త్ టూరిజం అని కూడా అంటుంటారు. కాగా.. ఇప్పుడు ఈ విధానానికి బ్రేక్ పడనుంది. అలాగే.. పుట్టుక తోనే పౌరసత్వం లభిచకపోతే 21 ఏళ్లు నిండిన తర్వాత తల్లిదండ్రల్ని అమెరికా తీసుకువచ్చేందుకు వీలు కాదు.దీంతో.. తల్లిదండ్రులు ఇండియాలో, పిల్లలు మాత్రమే అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.

Also Read : ఇజ్రాయిల్‌లో అంతుచిక్కల పరిణామాలు.. ఆ దేశ ఆర్మీచీఫ్ ఎందుకు రాజీనామా చేశారు..

అమెరికాకు చదువుకునేందుకు వెళ్లి అక్కడే వేరే దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుని సెటిలైపోతుంటారు. అలాంటి వారికి పుట్టిన పిల్లల విషయంలో అనేక చిక్కులు వచ్చే ప్రమాదముంది. ఈ విషయంలోనూ భారతీయులు భారీగా నష్టపోనున్నారు. ఎందుకంటే.. విదేశాల్లోని విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×