Allu Arjun and Shah Rukh Khan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు బాలీవుడ్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా అల్లు అర్జున్ ఇంకా డైరెక్ట్ హిందీ మూవీని చేయలేదు. పుష్ప, పుష్ప 2 మూవీతో ప్రపంచం నలుమూలలా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో బాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ నార్త్ లో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హిందీ సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అంతకంటే ముందే అల్లు అర్జున్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)తో కొలాబరేట్ కాబోతున్నట్టు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది.
పవర్ ఫుల్ కొలాబరేషన్
2023లో షారుక్ ఖాన్, 2024 అల్లు అర్జున్ (Allu Arjun) కు ల్యాండ్ మార్క్ ఇయర్స్ అని చెప్పాలి. షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాలీవుడ్ లోని రికార్డులను బద్దలు కొట్టారు. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో ఆ రికార్డులను అధిగమించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్న ఇద్దరు సూపర్ స్టార్లు ఇప్పుడు ఓ అద్భుతమైన ప్రాజెక్టు కోసం కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్, అల్లు అర్జున్ కొత్త థమ్స్ అప్ యాడ్ ప్రకటనలో నటించబోతున్నట్టు నడుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే ఇద్దరు ఐకాన్ స్టార్లు మొట్టమొదటిసారి స్క్రీన్ ని షేర్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలీదు గానీ ఇప్పటికే వైరల్ గా మారింది. మరి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, సౌత్ స్టైలిష్ స్టార్ బన్నీతో కలిస్తే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం. ఈ కాంబినేషన్ ను తెరపై చూడడానికి అద్భుతంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బన్నీ, షారుక్ పాన్ ఇండియా అప్పీల్
షారుక్ ఖాన్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా మంచి పాపులారిటీని కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ మూవీతో హిందీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ హీరోగా మారాడు. మొత్తానికి ఇలా ట్రెండింగ్ లో ఉన్న ఇద్దరు పాన్ ఇండియా హీరోలు కలిసి నటిస్తే సెన్సేషన్ గా మారడం ఖాయం. 2025 ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఈ థమ్స్ అప్ యాడ్ ప్రసారం అవుతుందని తెలుస్తోంది. సరిగ్గా వేసవికాలం వచ్చే టైంకి ఈ యాడ్ ని రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక ఇద్దరు స్టార్స్ చరిష్మా, స్టార్ పవర్ ప్రదర్శించే విధంగా థమ్స్ అప్ యాడ్ యాక్షన్ ప్యాక్డ్, హై-ఎనర్జీ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటిదాకా థమ్స్ అప్ యాడ్ కి షారుక్ ఖాన్, అల్లు అర్జున్ సపరేట్ గా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పనిలో పనిగా వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ, షారుక్ ఫ్యాన్స్.