E-Paper
Advertisement

Kollywood Hero Simbu: శింబుకు రెడ్ కార్డ్.. థగ్ లైఫ్ నుంచి అవుట్.. ?

Kollywood Hero Simbu: శింబుకు రెడ్ కార్డ్.. థగ్ లైఫ్ నుంచి అవుట్.. ?
Advertisement

Kollywood Hero Simbu: కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం చెప్పాల్సిన అవసరం లేదు. శింబు సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా హీరోయిన్స్ తో ప్రేమలు, బ్రేకప్ లు అంటూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా శింబు మార్చినంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ను ఎవరు మార్చలేదనే చెప్పాలి.

ఇక ఆ విషయాలను పక్కన పెడితే.. శింబుపై నిర్మాత మండలి రెడ్ కార్డ్ జారీ చేసిందన్న విషయం తెల్సిందే. గతంలో శింబు కరోనా కుమార్ అనే సినిమా కోసం అడ్వాన్స్ తీసుకొని.. షూటింగ్ కు రావడం లేదని, మేకర్స్ నిర్మాత మండలిలో ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయి. దీంతో నిర్మాత మండలి శింబుకు రెడ్ కార్డ్ జారీ చేసిందని, ఇక నుంచి శింబు ఏ సినిమాలో నటించడానికి వీల్లేదని చెప్పినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. దీనివల్లనే శింబు.. కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.

Advertisement

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాలో మొదట దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు అని మేకర్స్ ప్రకటించారు. కొన్ని కారణాల వలన అతను తప్పుకోగా.. ఆ ప్లేస్ లోకి శింబు వచ్చి చేరాడు. అయితే ఇప్పుడు శింబు కూడా రెడ్ కార్డ్ వలన అవుట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శింబు ఈ రూమర్స్ పై స్పందించాడు. రెడ్ కార్డ్ అంటూ వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా థగ్ లైఫ్  టీమ్ కు శింబు బిర్యానీ ట్రీట్ ఇచ్చాడు.

ఇక ఒక ఇంటర్వ్యూలో శింబు మాట్లాడుతూ.. ” థగ్ లైఫ్ లో కమల్ హాసన్ తో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రపంచంలో నిజం చెప్పేవాళ్లు అది నిజమే అని చెప్పడానికి కష్టపడుతున్నారు. నేను నిజాలు మాట్లాడుతున్నాను. కరోనా కుమార్ నిర్మాతలతో ఒక చిన్న సమస్య.. అది నేను మాట్లాడి పరిష్కరించుకున్నాను. నాకెవ్వరూ రెడ్ కార్డ్ ఇవ్వలేదు ” అంటి స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరిఈ సినిమాతో శింబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×