BigTV English

Kollywood: పెరుగుతున్న విడాకుల కల్చర్..ఇప్పటికే ..?

Kollywood: పెరుగుతున్న విడాకుల కల్చర్..ఇప్పటికే ..?

Kollywood:పెళ్లి అంటే కేవలం మూడు ముళ్ళు.. ఏడడుగులు.. మాత్రమే కాదు రెండు హృదయాల కలయిక కూడా.. జీవితాంతం కష్టసుఖాలలో తోడుగా ఉంటామని వాగ్దానం చేసిన భార్యాభర్తలు, ఇద్దరి మధ్య విభేదాలు వస్తే మారు మాట్లాడకుండా విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. కొంతమంది పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకుంటే, ఇంకొంతమంది వృద్ధాప్య వయసుకు వచ్చిన తర్వాత విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిస్తున్నారు. ఇంకొంతమంది చిన్నపిల్లలు ఉన్నా సరే వారి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వేరుపడుతున్నారు. ముఖ్యంగా మిగతా భాషలతో పోల్చుకుంటే కోలీవుడ్ లో విడాకులు ట్రెండ్ మొదలైందని చెప్పాలి. ఏడాది గడవకముందే ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటించి, అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.


విడాకుల ప్రకటన ముందుగా వినిపించగానే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ (A.R.Rahman). యావత్ సినీ ప్రపంచంలో హార్ట్ టాపిక్ గా మారింది ఈ విషయం. 29 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పింది ఈ జంట. ఇటీవల జూలైలో అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహంలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వీరు.. కనీసం ఆరు మాసాలు తిరగకుండానే విడాకులు తీసుకునే అంత దూరం రావడంతో.. ఇంత పెద్ద గొడవ వీరి మధ్య ఏమొచ్చింది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. “ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలే బంధం బీటలు వారడానికి కారణమని” సైరా భాను (Saira Banu) లాయర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరొకవైపు “పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ” ఏఆర్ రెహమాన్ ఒక్క స్టేట్మెంట్తో రిలేషన్ ఎలా ఉందో తెలిపాడు.

ఇక ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించడానికి ఆరు నెలల ముందు ఈయన మేనల్లుడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీ.వీ.ప్రకాష్(G. V.Prakash)కూడా బ్రేకప్ చెప్పారు. సింగర్ సైంధవి(Saindhavi)తో 11 ఏళ్ల రిలేషన్ కు ఎండ్ కార్డు వేశారు.


ఇక తర్వాత ఎంతో అన్యోన్యంగా కోలీవుడ్ లో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జంట జయం రవి(Jayam Ravi) – ఆర్తి(Arti). వీరిద్దరూ కూడా విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి విడిపోయినట్లు వార్తలు వినిపించగా.. మరొకవైపు జయం రవి ఇంకొకరిని ఇష్టపడడం వల్లే ఆమె విడాకులు ఇచ్చింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ధనుష్(Dhanush )- ఐశ్వర్య(Aishwarya )కూడా విడాకులు ప్రకటించారు. దాదాపు 17 ఏళ్లకు పైగా వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్న ఈ జంట, సడన్గా విడాకులు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

వీరే కాదు అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) , అమలాపాల్(Amala Paul), సమంత(Samantha), ఏ ఎల్ విజయ్(AL Vijay) ఇలా చాలామంది విడాకులు తీసుకొని, అభిమానులను ఇబ్బంది. పెట్టారు.

ఇలా ఎన్నో జంటలు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఇవే అంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఎన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నా సరే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, పనిలో పడి కుటుంబాన్ని దూరం పెట్టడం, నమ్మకం కోల్పోవడం, ప్రేమానురాగాలు తగ్గడం వల్లే ఈ కఠిన నిర్ణయానికి దారితీస్తోందని సమాచారం. ఏది ఏమైనా సెలబ్రిటీలు విడాకులు తీసుకొని అభిమానులను పూర్తిగా హర్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×