Ram Gopal Varma Case: తమ ప్రవర్తన వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా కూడా కొందరు వ్యక్తులు తమ పద్ధతిని మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు అంటే వారి మాటలు, ప్రవర్తనలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కోక తప్పదు. అందుకే చాలావరకు సినీ రంగంలో పనిచేసేవారు ఆచితూచి మాట్లాడతారు. అలా మాట్లాడినా కూడా చిక్కుల్లో పడేవారు ఉంటారు. కానీ వారందరిలో రామ్ గోపాల్ వర్మ చాలా భిన్నం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన పద్ధతి మార్చుకునేది లేదని ఫిక్స్ అయ్యారు వర్మ. దానివల్లే తాజాగా తన జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ విషయంలో తనను తప్పించడానికి ఒక స్టార్ హీరో రంగంలోకి దిగినట్టు సమాచారం.
ఎన్నో కాంట్రవర్సీలు
రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలు సినిమాల వరకు పరిమితమయితే పర్వాలేదు కానీ అవి రాజకీయాల వైపుకు వెళ్లాయి. ఇప్పుడు ఆ సినిమాలే ఆయన కొంప ముంచాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగక ముందు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలవక ముందు ఆయనపై ఎన్నో ట్రోల్స్ చేశారు వర్మ. అంతే కాకుండా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు ఆయన చేసిన పనులకు ఇప్పుడు ఎఫెక్ట్ పడనుంది. అయితే వీటి వల్ల తనకు ఇబ్బందులు కలగకుండా ఒక హీరో ఆయనకు అండగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ఆర్జీవికి షాక్ ఇచ్చిన పోలీసులు..అరెస్ట్ తప్పదా..?
ఇప్పటికే ఎన్నో సమస్యలు
రామ్ గోపాల్ వర్మకు సాయం చేయడానికి రంగంలోకి దిగిన ఒక స్టార్ హీరోకు ఇప్పటికే చాలా కష్టాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా తెలంగాణలో సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఈ స్టార్ హీరోకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో కూడా ప్రభుత్వానికి ఎదురెళ్లడానికి సిద్ధమయ్యారు. రామ్ గోపాల్ వర్మపై ఉన్న అభిమానంతో తనకు సాయం చేయడానికి ఈ హీరో ముందుకొచ్చినా.. తనకు దీని వల్ల ఎంత నష్టం కలుగుతుందో ఆయన గుర్తించలేకపోతున్నారని అర్థమవుతోంది. ఇప్పుడు వర్మకు ఆయన ఫామ్ హౌస్‌లోనే ఆశ్రయమిచ్చి పెద్ద రిస్కే తీసుకుంటున్నారు ఈ హీరో.
ఆ సినిమా వల్లే
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి ‘వ్యూహం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ విడుదల చేయడానికి ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. కానీ దీని విడుదల కోసం వర్మ చాలా కష్టపడ్డాడు. ఇందులో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ పలు కీలక సన్నివేశాలను తీశాడు. పైగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వారిపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశాడు. ఇన్‌డైరెక్ట్‌గా మాత్రమే కాకుండా డైరెక్ట్‌గా వారి పేర్లను ఉపయోగించి కూడా ట్రోల్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆర్జీవీపై యాక్షన్ తీసుకోవాలని ఆయన ఫిక్స్ అయ్యి నోటీసులు జారీ చేశారు.