Koratala Shiva:ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) గురించి పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన డైరెక్షన్లో ఎంతోమంది హీరోలకు మంచి కెరియర్ అందించారు. తొలుత బిటెక్ పూర్తి చేసిన కొరటాల శివ 1998లో ఉద్యోగం చేసుకుంటూ సినిమా రంగం వైపు అడుగులు వేయాలనుకున్నారు. అందులో భాగంగానే వరుసకు బావ అయిన పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి.. ఒక్కడున్నాడు, ఊసరవెల్లి, బృందావనం, మున్నా వంటి చిత్రాలకు రచయితగా పనిచేశాడు..అలా తెలుగు సినిమా రచయితగా, దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న కొరటాల శివ ప్రభాస్ (Prabhas)హీరోగా వచ్చిన మిర్చి(Mirchi)సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఒక్క ఫ్లాప్.. కొరటాల శివ కెరియర్ పై మచ్చ..
ఇక తర్వాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు, 2016లో జనతా గ్యారేజ్, 2018లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలు చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే చేసింది 4 సినిమాలే అయినా ప్రతి సినిమాతో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) కలయికలో ‘ఆచార్య’ సినిమా చేయగా.. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్ ఫలితం మొత్తం కొరటాల శివ పైన వేయడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి కూడా కొరటాల శివదే తప్పు అంటూ కామెంట్లు చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన మిస్టేక్ వల్లే సినిమా డిజాస్టర్ అయిందని అనుకున్నారు.
ఎన్టీఆర్ తో భారీ సక్సెస్..
అయితే ఆ తర్వాత తనలోని టాలెంట్ ను నిరూపించుకోవాలనుకున్నారు కొరటాల శివ. అందులో భాగంగానే ఎన్టీఆర్(NTR)తో ‘దేవర’ సినిమా చేసి మరో మాస్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అటు ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. కానీ సోలో హీరోగా ఆయన ఆరేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సైతం సినిమా కోసం ఎంతో ఆత్రుతగా చూశారు. అయితే ఆత్రుతకు తగ్గట్టుగానే కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులకు మంచి విందు భోజనం తినిపించారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అంటూ అభిమానులు కూడా సందిగ్ధంలో పడ్డారు.
రౌడీ హీరోతో కొరటాల నెక్స్ట్ మూవీ..
దేవర సినిమా తర్వాత కొరటాల శివకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. అటు స్టార్ హీరోలు అందరూ కూడా బిజీ అయిపోయారు. కనీసం రెండు మూడేళ్ల వరకు ఎవరు కూడా ఈయనకు డేట్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే కొరటాల శివ ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay deverakonda)తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం కథ కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో డిజాస్టర్ ను చవి చూసిన విజయ్.. గౌతమ్(Goutham) డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే రౌడీ హీరో రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు కొరటాల శివ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం మాస్ హిట్ పక్కా అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.