Game Changer Movie : తెలుగు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత దిల్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. సక్సెస్, ఫెయిల్యూర్, డబ్బు రావడం, డబ్బు పోవడం కామన్ థింగ్. ఇక్కడ నేను నిలబడటమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నమ్ముతారు దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఏమీ ఆలోచించకుండా ఒకప్పుడు థియేటర్ కు వెళ్లి పోయేవారు. రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యానర్ నుంచి సినిమాలు రావడం తగ్గింది కానీ ఒకప్పుడు ఈ బ్యానర్ కు ఉన్న రేంజ్ వేరు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అవుతూ వస్తుంది. ఈసారి సంక్రాంతికి మాత్రం రెండు సినిమాలను సిద్ధం చేశాడు దిల్ రాజు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ తో పాటు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇకపోతే గేమ్ చేంజెర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మీద మంచి నమ్మకాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో బెనిఫిట్స్ లో రద్దు అని ఇదివరకే వార్తలు వచ్చాయి. అలా కాకుండా చాలా పద్ధతిగా ప్లాన్ చేసి ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్ర రెండు చోట్ల కూడా బెనిఫిట్స్ ప్లాన్ చేస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.
Also Read : Koratala Shiva: రౌడీ హీరోతో సినిమా.. ఫిక్స్ అయితే మాస్ హిట్ గ్యారెంటీ..!
రీసెంట్ గా జరిగిన ప్రీమియర్ షో ఇన్సిడెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా కలకలం రేపింది. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తేరుకోలేదు. ఆ ఇన్సిడెంట్ వలన ఒక అబ్బాయి ఇంకా హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్నారు. ఈ తరుణంలో బెనిఫిట్స్ షోస్ వేయడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకని దిల్ రాజు రెండు చోట్ల కూడా పక్కా ప్లానింగ్ తో బెనిఫిట్ షోస్ ఉండబోతున్నాయి అని అనౌన్స్ చేశారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు పాటలు సినిమా మీద మంచి అంచనాలను పెంచుతున్నాయి. టీజర్ కూడా ఆకట్టుకునే విధంగా కట్ చేశాడు శంకర్.
Also Read : R Ashwin Biopic : తెరపైకి టీమిండియా క్రికెటర్ అశ్విన్ బయోపిక్… అయ్యే పనేనా?