BigTV English

TG Assembley : ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసుకున్నారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశం

TG Assembley : ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసుకున్నారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్  ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశం

TG Assembley : తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు అనేక అంశాలపై వాదోపవాదాలు జరిగాయి. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విధానంపై ప్రధాన ప్రతిపక్షం, అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోయారంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకు.. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కేటాయింపు విధానాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


హైదరాబాద్ నేటి వేల కోట్లు అందించే మహా నగరంగా, ఆర్థిక రాజధానిగా ఎదిగింది అంటే గతంలో పాలించిన కాంగ్రెస్ నాయకుల పుణ్యమే అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ నేతృత్వంలో హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు రూపంలో అద్భుత మణిహారాన్ని అందించిందని అన్నారు. విశ్వనగరంగా మారడంతో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, రింగ్ రోడ్డు, ఫార్మా సంస్థలు సహా.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలే కారణమన్నారు.

అలాగే.. కృష్ణానదీ జలాలను, గోదావరీ జాలాలను భాగ్యనగరానికి తరలించి.. ఇక్కడి కోటి మంది జనాల దాహార్తిని తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. నగరానికి ఆధునిక సొబగులు అద్దేందుకు మెట్రో రైలును తీసుకురావాలని భావించి.. అందుకు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి.. మరెన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపిన సీఎం… రోజుకు 24 గంటలు, ఏడాదికి 365 రోజుకు నగరానికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే.. రాష్ట్రంలో జాతీయ, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను నెలకొల్పడం, వాటిని నిర్వహించడంతో కాంగ్రెస్ పార్టీ పనితీరును సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. వాటన్నింటిని కారణంగానే.. హైదరాబాద్ మహానగరంగా కోటి మంది ప్రజలకు అద్భుత నగరంగా మారిందని ప్రశంసించారు.


ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలోని అన్ని సాగు భూములకు నీటిని అందించేందుకు వివిధ ప్రాజెక్టులు రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి.. వేల కోట్లతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రయత్నం జరిగిందని గుర్తు చేశారు. వాటి కోవలోనే హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు.. చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దీని నిర్మాణం కోసం రూ. 6 వేల 500 కోట్లు అప్పుగా తీసుకువచ్చి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించినట్లు గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏళ్లుగా దాని అప్పుల్ని తీర్చుతున్నామన్నారు. ఇన్నాళ్లకు ఆ రహదారి అప్పు తీర్చేశామని తెలిపారు. అలాంటి రహదారిని అయాచితంగా, కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఆనాటి బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారని అన్నారు.

ఎన్నికల ముందు అమ్ముడుపోయి, డబ్బులు తీసుకుని.. ఔటర్ రింగు రోడ్డును అమ్ముకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన తర్వాతే.. ఉన్నకాడికి అమ్ముకోవాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు అనుకున్నారని, ఆ తర్వాత దేశ విడిచి వెళ్లిపోవాలని ప్రణాళికలు రచించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కారణంగానే.. ఎన్నికల ముందు హడావిడిగా ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేశారంటూ అసెంబ్లీలో అన్నారు.

Also Read : ఫార్ములా కార్ రేస్ కేసులో సంచలనం.. ఏ1గా కేటీఆర్.. ఏ2గా అరవింద్ కుమార్

మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో కోరిన మేరకు ఓటర్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సభ్యులందరి ఆమోదంతో  ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. విచారణకు సంబంధించిన విధివిధానాల్ని మంత్రివర్గంలో చర్చించి, సహచరుల సూచనలు, సలహాలతో విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇది ప్రతిపక్ష పార్టీకి చెందిన హరీష్ రావు కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×