Big Stories

iQOO Series : ఐక్యూ లవర్స్‌కు పండగే.. మూడు ఫోన్లు లాంచ్!

iQOO Series : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQOO ఇటీవల కాలంలో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఆఫర్డ్‌బుల్ ప్రైజ్‌లో మంచి ఫీచర్లతో ఫోన్లను అందిస్తుంది. మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక మార్క్‌ను చూపిస్తుంది. ఈ క్రమంలో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో iQOO Z9 Turbo, iQOO Z9, iQOO Z9x మోడళ్లు ఉన్నాయి. గత బుధవారం జరిగిన లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ iQOO Z9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ఫీచర్లు, ధర తదితర విషయాల గురించి తెలుసుకోండి.

- Advertisement -

iQOO Z9 సిరీస్ ధర విషయానికి వస్తే 8GB + 128GB మోడల్ ధర రూ. 17,000గా కంపెనీ నిర్ణయించింది. 8GB + 256GB ధర రూ. 18,763, 12GB+ 256 GB ధర రూ. 20,000గా కంపెనీ నిర్ణయించింది.ఇది కాకుండా, 12GB + 512GB టాప్-ఎండ్ వేరియంట్ రూ. 23,000కి అందుబాటులో ఉంది. iQoo Z9x 8GB + 128GB వెర్షన్ కోసం దాదాపు రూ. 15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది డార్క్ నైట్, ఫెంగ్ యుకింగ్,  స్టార్‌బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Also Read :  బెస్ట్ డీల్.. రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్

iQoo Z9 Turbo గురించి చెప్పాలంటే 12GB + 256GB మోడల్ ధర సుమారుగా రూ. 23,000 నుండి ప్రారంభమవుతుంది. దాని 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB ధర రూ. 26,000,రూ. 28,120గా నిర్ణయించారు. iQoo Z9 టర్బో, iQoo Z9 డార్క్ నైట్, మౌంటైన్ గ్రీన్, స్టార్‌బర్స్ట్ వైట్ కలర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం చైనాలో మూడు ఫోన్లు చైనా మార్కెట్‌లో సేల్‌కు వచ్చాయి.

iQOO Z9 Turbo, iQOO Z9 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్, 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో ఈ ప్రీమియం మోడళ్లు వస్తున్నాయి. iQOO Z9 స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.

iQOO Z9 Turbo ఫోన్ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో కొత్త 50MP సోనీ LYT-600 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. iQOO Z9 50MP Sony LYT-600 సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు వెనుకవైపు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. iQOO Z9, Z9 Turbo 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని ప్యాక్‌ని కలిగి ఉన్నాయి.

Also Read : హెచ్ఎమ్‌డీ నుంచి మూడు క్లాసిక్ ఫోన్లు.. ఎంత చీప్ అంటే!

iQOO Z9x  6.72 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇందులో 12GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS2.2 స్టోరేజ్ ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP AI యాంటీ-షేక్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో  కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం 6,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News