BigTV English

Fire Accident: పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి..

Fire Accident: పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి..

Fire Accident Near Patna Railway Station: పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రాథమికంగా సిలిండర్ పేలుడు అగ్నిప్రమాదానికి కారణమని తెలుస్తోంది.


పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున 20 మందికి పైగా ప్రజలను సురక్షితంగా చేర్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న హోంగార్డు, ఫైర్ సర్వీసెస్ డీజీ శోభా ఓహత్కర్ విలేకరులతో మాట్లాడుతూ, “మేము 16,000 కంటే ఎక్కువ హోటళ్లలో ఫైర్ ఆడిట్ చేసాము. అది ఇంకా కొనసాగుతోంది, వారికి ఫైర్ ఆడిట్‌లో నిర్దిష్ట సూచనలు ఇచ్చాము. కొందరు అనుసరించారు.. కొందరు నిర్లక్ష్యంతో సూచనలను పాటించరు.. ఇది ప్రాథమికంగా, సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు కనిపిస్తున్నాయి.”


“మేము మంటలను అదుపులోకి తెచ్చాము, దీని గురించి ఉదయం 11 గంటలకు సమాచారం అందింది. సరైన విచారణ ద్వారా ఖచ్చితమైన కారణం కనుగొని.. తగిన చర్యలు తీసుకుంటాము” అని చెప్పారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×