E-Paper
Advertisement

Krishna Vamsi: పవన్ కళ్యాణ్ తో సినిమా.. నా దురదృష్టం అంతే

Krishna Vamsi: పవన్ కళ్యాణ్ తో సినిమా.. నా దురదృష్టం అంతే
Advertisement

Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో కుటుంబ కథా చిత్రాలు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి అని చెప్పాలి. సింధూరం, నిన్నే పెళ్లాడతా, మురారి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇక ఇప్పుడున కృష్ణవంశీ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.

ఇక సోషల్ మీడియా వచ్చాక అభిమానులకు దగ్గరగా ఉంటున్న కృష్ణవంశీ.. నిత్యం వారితో చిట్ చాట్ చేస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు. తాజాగా మరోసారి కొంతమంది నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు కృష్ణవంశీ ఓపిగ్గా సమాధానాలు తెలిపాడు. ఇక ఆయన కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో పనిచేశారు. ఎందుకో పవన్ కళ్యాణ్ తో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఇదే విషయాన్ని ఒక నెటిజన్ బయటపెట్టాడు.

Advertisement

“పవన్ కళ్యాణ్ కు మీరెప్పుడైనా కథ చెప్పారా.. ? మీ కాంబోలో ఒక సినిమా వచ్చి ఉంటే బావుండేది” అని అడిగాడు. దానికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. “పవన్ కళ్యాణ్ కు కథ చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. కానీ, చేయడం కుదరలేదు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా. ఒకవేళ ఆ సినిమా వచ్చి ఉంటే. బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ అయ్యేది.. నా దురదృష్టం అంతే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

నిజంగా పవన్ కు అంత మంచి కథ పడిఉంటే బావుండేది. ఇప్పుడైనా ఒక సినిమా ప్లాన్ చేయండి పవన్ తో అని అభిమానులు కామన్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం పవన్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. వాటిని ఫినిష్ చేసి.. సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.మరి అభిమానుల కోరిక భవిష్యత్ లో నెరవేరుతుందేమో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×