BigTV English

NBK 109 Update: పూనకాలు తెప్పించే అప్డేట్.. బాలయ్య ఆవేశాన్ని చూసేందుకు రెడీగా ఉండండి: దర్శకుడు బాబి

NBK 109 Update: పూనకాలు తెప్పించే అప్డేట్.. బాలయ్య ఆవేశాన్ని చూసేందుకు రెడీగా ఉండండి: దర్శకుడు బాబి

NBK 109 Shooting Update: బాలయ్య బాబు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీ సమయాన్ని గడుపుతున్నాడు. గతేడాది భగవంత్ కేసరితో ప్రేక్షకుల మందుకు వచ్చి అదరగొట్టేశాడు. ఇందులో ఫుల్ మాస్ యాక్షన్ పాత్ర చేసి దుమ్ము దులిపేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడు. ఇది వరకు ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో ఇప్పుడొక మూవీలో నటిస్తున్నాడు.


ఈ చిత్రం ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవల్లే తెరకెక్కిస్తున్నాడు. బాలయ్య అభిమానులు కోరుకున్న విధంగానే ఇందులో బాలయ్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: డైరెక్టర్ బాబీ బర్త్ డే.. బాలయ్య బాబు ‘NBK 109’ నుంచి మాస్ వీడియో అదిరిపోయింది


ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత నాగవంశీ, సౌజన్య కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అంచనాలు ఓ రేంజ్‌లో పెంచేశాయి. ముఖ్యంగా గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్‌లో బాలయ్య ఊరమాస్ యాక్షన్ చూసిన అభిమానులు ఈ సినిమా పక్కా హిట్ అంటూ ఫిక్స్ అయిపోయారు.

ఆ గ్లింప్స్‌లో బాలయ్య ఊచకోత ఓ రేంజ్‌లో ఉంది. విలన్‌లను వేటాడుతున్న తీరు అబ్బో అదిరిపోయిందనే చెప్పాలి. అతడి డైలాగ్ డెలివరీ, స్వాగ్ అంతా దుమ్ము రేగిపోయింది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ సినిమా తాజా షెడ్యూల్ జైపూర్‌లో పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో బాలయ్య పాల్గొన్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. జైపూర్‌లో తాజాగా ఫైట్ సీన్స్ షూటింగ్ పూర్తయిందని తెలిపాడు. బాలయ్య ఎప్పుడూ ఒకే ఎనర్జీతో ఉంటారని.. మోస్ట్ పవర్‌ఫుల్ సీన్లలో బాలయ్య ఆవేశాన్ని చూసేందుకు రెడీగా ఉండాలని తెలిపాడు. ఈ మేరకు అతి త్వరలో ఈ సినిమా టైటిల్‌ను వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×