BigTV English

Kriti Sanon Prabhas: ప్ర‌భాస్ – కృతి స‌న‌న్ ఎంగేజ్‌మెంట్‌.. ట్వీట్ వైరల్‌!

Kriti Sanon Prabhas: ప్ర‌భాస్ – కృతి స‌న‌న్ ఎంగేజ్‌మెంట్‌.. ట్వీట్ వైరల్‌!

Kriti Sanon Prabhas:టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ప్ర‌భాస్ పెళ్లి కోసం ఆయ‌న ఫ్యాన్స్‌తో పాటు అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య అన్‌స్టాప‌బుల్ టాక్‌షోలోనూ ప్ర‌భాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ రాసి పెట్టి లేదు అనేశారు. అదే సంద‌ర్భంలో కృతి స‌న‌న్‌తో ల‌వ్ ట్రాక్ గురించి అడిగిన‌ప్పుడు అదేం లేద‌ని తేల్చేశారు. మ‌రో వైపు కృతి స‌న‌న్ కూడా ప్ర‌భాస్‌కు, త‌న‌కు మ‌ధ్య ప్రేమ‌, గీమ‌లాంటిది లేద‌ని చెప్పేసింది. ఈ త‌రుణంలో ఇప్పుడు మ‌రోసారి ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ ఎంగేజ్‌మెంట్ గురించి వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అందుకు కార‌ణం.. ఓవ‌ర్‌సీస్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు.


ఇంత‌కీ ఉమైర్ సంధు ఏం చేశాడో తెలుసా!.. వ‌చ్చే వారం ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ ట్వీట్ చేశాడు. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌కి మాల్దీవులు వేదిక కానున్నాయి అంటూ ఆయ‌న త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇప్ప్పుడు మ‌ళ్లీ ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి గురించిన వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్రం ఉమైర్‌ను టార్గెట్ చేసి కామెంట్స్ రూపంలో తిట్ట‌టం ప్రారంభించారు. ఉమైర్ సంధు తోచింది రాస్తాడ‌ని కొంద‌రు అంటున్నారు కూడా. మ‌రి ఈ వార్త‌ల‌ను ప్ర‌భాస్ ప‌ట్టించుకుంటాడో లేదో చూడాలి.

ప్ర‌భాస్, కృతి స‌న‌న్ క‌లిసి ఆది పురుష్ అనే సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా జూన్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తే, కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో న‌టించింది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికే రావాల్సింది. అయితే మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీపై వ‌చ్చిన ట్రోలింగ్స్‌తో ఆది పురుష టీమ్ అల‌ర్ట్ అయ్యింది. మ‌ళ్లీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు ఓం రౌత్‌.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×