BigTV English

Xiaomi Electric Car:కారు ఫోటోలు లీక్.. రూ.1.2 కోట్ల ఫైన్!

Xiaomi Electric Car:కారు ఫోటోలు లీక్.. రూ.1.2 కోట్ల ఫైన్!

Xiaomi Electric Car:చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమి… త్వరలో ఎలక్ట్రిక్​ కారును మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆ కారుకు సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో… షావోమీ సీరియస్ అయింది. ఆ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో కనిపెట్టి… లీక్ చేసిన వారికి ఏకంగా ఒక మిలియన్ యువాన్లు… అంటే మన కరెన్సీలో కోటీ 22 లక్షల రూపాయల ఫైన్ వేసింది.


చైనా ఈవీ మార్కెట్లో చాలా పోటీ ఉన్న నేపథ్యంలో… షావోమీ తొలి ఎలక్ట్రిక్​ కారుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. షావోమీ MS​11 సెడాన్​ పేరుతో తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ కారు డిజైన్, లుక్… అదిరిపోయేలా ఉన్నాయంటున్నారు… నెటిజన్లు. MS​11 సెడాన్… పోర్షే టైకాన్‌ను పోలి ఉందని అభిప్రాయపడుతున్నారు. పెద్ద విండ్ షీల్డ్, 4 డోర్స్, సింగిల్ ప్లేన్ గ్లాస్ పైకప్పుతో… టెస్లాను కూడా తలపిస్తోందని అంటున్నారు. ఇక అలాయ్ వీల్స్ మధ్యలో ‘షావోమీ’ బ్రాండ్​ లోగో కూడా ఉంది. షావోమీ ఈ కారును ఇప్పటికే చైనా రోడ్లపై పరీక్షించిందని సమాచారం. ప్రముఖ చైనీస్​ ఆటో మొబైల్​ సంస్థ బీవైడీకి చెందిన సియెల్​ ఎలక్ట్రిక్​ సెడాన్‌ తరహాలోనే షావోమి ఈవీ డిజైన్‌ ఉండనుందని సమాచారం. కారు ముందు భాగంలోని లీడార్ సెన్సార్‌ ఆధారంగా… ఇది అటానమస్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్ సామర్థ్యంతో రాబోతోందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు… కంపెనీ తొలి ఎలక్ట్రిక్​ కారు ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్​ కావడంపై షావోమీ సీరియస్‌గా స్పందించింది. బీజింగ్‌కు చెందిన మోల్డింగ్​ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్​ అనే వెండర్​ ద్వారా… కారు ఫొటోలు లీక్​ అయినట్టు గుర్తించింది. ఈ లీక్‌ను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని, సెక్యూరిటీ బ్రీచ్​కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని… మోల్డింగ్​ టెక్నాలజీ కంపెనీని షావోమీ ఆదేశించింది. అంతేకాదు… ఆ సంస్థకు 10 లక్షల యువాన్ల జరిమానా విధించింది.


For More Live Updates Follow Us :-

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×