E-Paper
Advertisement

ఆ ఒక్క డైలాగ్ నా పొట్ట కొట్టింది… ఆయనకు రుణపడి ఉంటానన్న కుమారి ఆంటీ..

ఆ ఒక్క డైలాగ్ నా పొట్ట కొట్టింది… ఆయనకు రుణపడి ఉంటానన్న కుమారి ఆంటీ..
Advertisement

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. రోడ్డు పక్కన ఎన్నో రకాల ఆహార పదార్థాలను అమ్ముతూ ఎంతో మంది ఆకలి తీర్చుతూ పెద్ద ఎత్తున బిజినెస్ జరుపుకుంటున్నారు. కుమారి ఆంటీ 2011వ సంవత్సరం నుంచి ఈ బిజినెస్ ప్రారంభించారు కానీ ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎంతో ఫేమస్ అయ్యి ప్రస్తుతం సెలబ్రెటీ రేంజ్ లో హోదా అనుభవిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో కుమారి ఆంటీ(Kumari Aunty) బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు అలాగే సినిమా ప్రమోషన్లలో కూడా ఈ భాగం అవుతున్న సంగతి తెలిసిందే.

రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మీది 1000 అయింది..

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ తన బిజినెస్ గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుమారి ఆంటీ సోషల్ మీడియా వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా తెలిపారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభించారనే ప్రశ్న ఎదురవడంతో తాను 2011 వ సంవత్సరం నుంచి ఈ బిజినెస్ చేశానని అయితే “రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మీది 1000 అయింది”అనే డైలాగు కారణంగానే పాపులర్ అయ్యానని తెలిపారు. అసలు ఆ వీడియో ఎవరు తీసారో కూడా తనకు తెలియదని కుమారి ఆంటీ తెలిపారు.

ట్రాఫిక్ ఎక్కువవడంతోనే ఆంక్షలు..

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది యూట్యూబర్లు తన స్టాల్ వద్దకు వచ్చి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. తద్వారా ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిందని దీంతో పోలీసులు తన బిజినెస్ అక్కడి నుంచి తీసేయాలని ఆంక్షలు పెడుతూ తన షాప్ తీసేసే పరిస్థితులు ఏర్పడ్డాయని కుమారి ఆంటీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా సోషల్ మీడియా కారణంగా తనకు చాలా ఇబ్బంది కూడా కలిగిందని అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారు చూపిన చొరవ ఎప్పటికీ మర్చిపోలేనని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని కుమారి ఆంటీ తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు..

Advertisement

ఈ సందర్భంగా కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ పేదల పాలిట దేవుడిలా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన పరిపాలన రామరాజ్యంలా ఉందని ఇలాంటి వాళ్లు ఉన్నన్ని రోజులు మాలాంటి వారికి ఎలాంటి డోకా ఉండదు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆరోజు రేవంత్ రెడ్డి సార్ చొరవ తీసుకోకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుందని, మాకు ఇంత సహాయం చేసినందుకు సీఎం సార్ కు చాలా చాలా థాంక్స్ అంటూ కుమారి ఆంటీ తెలిపారు. ఈమె ప్రతిరోజు మధ్యాహ్నం హైటెక్ సిటీ ప్రాంతంలో ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసి తీసుకువచ్చి అక్కడ అమ్ముతూ భారీ స్థాయిలోనే సంపాదన అందుకుంటున్న సంగతి తెలిసిందే.

Also Read: ఎవరేమనుకున్నా పర్లేదు.. ప్రభాస్ అన్న మీరు నా హార్ట్ లో ఉన్నారు: శర్వానంద్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×