BigTV English

Monalisa: కుంభమేళ మోనాలిసా క్రేజ్ మామూలుగా లేదుగా.. షూటింగ్ స్పాట్ నుండీ వీడియో వైరల్!

Monalisa: కుంభమేళ మోనాలిసా క్రేజ్ మామూలుగా లేదుగా.. షూటింగ్ స్పాట్ నుండీ వీడియో వైరల్!
Advertisement

Monalisa:అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి ఊహించకుండానే అనుకోని స్థాయి, గుర్తింపు లభిస్తూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు ఒక అమ్మాయి జీవితంలో అలాగే జరిగిందని చెప్పాలి. మహా కుంభమేళాలో పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఒక అమ్మాయికి ఇప్పుడు అభిమానులు నీరాజనం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆమెను చూడడానికి ఎగబడుతున్నారు. ఆమె ఎవరో కాదు మోనాలిసా భోంస్లే. ఇటీవల జరిగిన ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాలో పూసలమ్ముకుంటూ కనిపించిన ఈ అమ్మాయిని చూసి ముగ్దుడైన ఒక వ్యక్తి ఈమె ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేం వుంది ఓవర్ నైట్ లోనే ఈ అమ్మాయి వైరల్ అయిపోయింది.


ఒక్క వీడియోతో భారీ పాపులారిటీ..

అలా ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మోనాలిసా.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ భారీగానే వెనకేసుకుంటుంది. అంతేకాదు ఇటీవల ఈమె ఒక ఆల్బమ్ సాంగ్ లో కూడా పాటిస్పేట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబ్ లో భారీ పాపులారిటీ కూడా లభించింది. పైగా అత్యధిక వ్యూస్ , లైక్స్ కూడా ఈ వీడియో సొంతమయ్యాయి. అయితే ఇప్పుడు ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. తాజాగా ఒక షూటింగ్ నిమిత్తం వెళ్లిన మోనాలిసా ను చూడడానికి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


షూటింగ్ స్పాట్లో మోనాలిసా.. ఎగబడ్డ జనం..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక సినిమా షూటింగ్ కోసం మధ్యప్రదేశ్లోని శివ్ పురికి వెళ్ళింది మోనాలిసా. అక్కడ ఈమెను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. దీంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మోనాలిసా అందాన్ని చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఒక్క వీడియోతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది మోనాలిసా. పైగా ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మోనాలిసా బ్యాక్ గ్రౌండ్..

ఇండోర్ కి చెందిన మోనాలిసా పూసల దండలు అమ్ముతూ కుంభమేళాలో సెన్సేషనల్ గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలలో ఈమె కళ్ళు , హెయిర్ స్టైల్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈమె లుక్ లో ఉన్న ఆ చక్కని చిరునవ్వు, చూస్తే చూడాలనిపించే ఈమె అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమెకు సంబంధించి వైరల్ అయిన వీడియో ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈమె వీడియో అలా వైరల్ అయిందో లేదో ఇలా ఈమెతో ఫోటోలు దిగడానికి చాలామంది భక్తులు వెంటపడ్డారు. దీంతో తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగుతోందని తన కుమార్తెను తీసుకొని మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత ఈమె ఇంటికి ఒక బాలీవుడ్ డైరెక్టర్ నేరుగా వెళ్లి తన సినిమాలు ఈమెకు అవకాశం కల్పిస్తూ సైన్ కూడా తీసుకున్నారు. కానీ ఆయన ఒక కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ALSO READ:Raj Tarun:రాజ్ తరుణ్ ఏంటీ పనులు… జీవితంలో అలసిపోయావా ?

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×