House Full 5 OTT: ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలైన సినిమాలు నెల రోజుల గ్యాప్ లేకుండానే తిరిగి ఓటీటీలో విడుదల అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే ఓటీటీలో విడుదల చేసే ముందు అధికారిక ప్రకటన తెలియజేయడమే కాకుండా పలు ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తుంటారు. కానీ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన హౌస్ ఫుల్ 5 (House Full 5)సినిమా మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలో ప్రసార మోతు ప్రేక్షకులను సందడి చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీస్ లో “హౌస్ ఫుల్” ఒకటి ప్రస్తుతం ఈ ప్రాంచైజీ నుంచి 5 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రెండు క్లైమాక్స్ లతో హౌస్ ఫుల్ 5..
ఇలా హౌస్ ఫుల్ 5 అంటూ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా జూన్6 న థియేటర్లలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్(Abhisekh Bachchan), రితేష్ దేశ్ ముఖ్(Ritesh Deshmukh), సంజయ్ దత్ (Sanjay Dutt)వంటి తదితరులు నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ థియేటర్లలో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో 250 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఇప్పటివరకు ఏ సినిమాకి లేనివిధంగా ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లతో విడుదల చేయడం విశేషం.
అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం…
ఈ సినిమా హౌస్ ఫుల్ 5A, హౌస్ ఫుల్ 5 B అంటూ రెండు క్లైమాక్స్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇలా థియేటర్లో జూన్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో ప్రసారమవుతుంది అయితే ఈ సినిమాని అక్కడ చూడాలనుకునేవారు ముందుగానే.రూ.349 చెల్లించాల్సి ఉంటుందనీ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా 5A,5B రెండు హిందీ వెర్షన్ లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు చూడాలి అంటే 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
సౌత్ పై ఫోకస్ చేసిన బాలీవుడ్ స్టార్ట్స్..
ఈ అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్నిసాజిద్ నదియాద్వాలా, వార్దా నదియాద్వాలా మరియు ఫిరుజీ ఖాన్ నిర్మించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన ఈ కామెడీ-థ్రిల్లర్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పాలి.మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఎంచక్కా అమెజాన్ ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోలు కూడా పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో శివుడి పాత ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సంజయ్ దత్ కూడా వరుస సౌత్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Sai Pallavi: అందుకే సీతగా సాయి పల్లవి.. ఆ లక్షణం ఉన్న ఏకైక హీరోయిన్