E-Paper
Advertisement

Lakshmi Menon: తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన విశాల్ బ్యూటీ..!

Lakshmi Menon: తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన విశాల్ బ్యూటీ..!
Advertisement
Lakshmi Menon news

Lakshmi Menon news(Cinema news in telugu) :

కోలీవుడ్ హీరో విశాల్‌ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. గతంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారితో ప్రేమలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత అభినయశ్రీ అనే హీరోయిన్‌తో కూడా లవ్ ట్రాక్ నడిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఒక్కోసారి ఒక్కో హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై విశాల్ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ రూమర్స్ ఆగలేదు.

ఇప్పుడు తాజాగా మలయాళ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు.. వీరిద్ధరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కూడా విశాల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. రూమర్స్ ఆగకపోవడంతో దీనిపై ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలపై లక్ష్మీ మీనన్ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా కేవలం వట్టి రూమర్స్ అంటూ తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

Advertisement

తాను స్కూల్లో ఉన్న సమయంలోనే తన క్లాస్మెట్‌తో ప్రేమలో పడినట్లు తెలిపింది. అలా వారిద్దరూ కొద్ది రోజులు మాట్లాడుకునే వాళ్లమని చెప్పారు. అయితే ఉన్నత చదువుల రీత్యా దూర ప్రాంతాలకు వెళ్లడంతో తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని తెలిపింది. దీని కారణంగానే ప్రేమ కూడా తగ్గిపోవడం జరిగిందని పేర్కొంది. అంతేకాకుండా ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ వేరొకరిని పెళ్లి చేసుకున్నారని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో విశాల్‌తో ఆమె ప్రేమ వ్యవహారం వట్టి రూమర్సేనని తేలిపోయింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×