E-Paper
Advertisement

బెంగళూరు–ముంబై వందేభారత్ స్లీపర్‌కు రైల్వే బోర్డు ఆమోదం.. ప్రారంభం ఎప్పుడంటే?

బెంగళూరు–ముంబై వందేభారత్ స్లీపర్‌కు రైల్వే బోర్డు ఆమోదం.. ప్రారంభం ఎప్పుడంటే?
Advertisement

Bengaluru to Mumbai Sleeper Train: బెంగళూరు నుంచి ముంబైకి వెళ్లే ప్రయాణికులకు త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రెండు కీలక నగరాల మధ్య రాత్రిపూట వేగవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రైలును ప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ రైలుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.  నవంబర్ 1న ఈ రైలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైలుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏ మార్గంలో నడిచే అవకాశం ఉంది?

ఈ రైలు SMVT బెంగళూరు నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వరకు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూట్ కు సంబంధించి గుంతకల్ మీదుగా వెళ్లే ప్రతిపాదన చర్చలో ఉంది. ఈ మార్గం ఖరారైతే అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె లాంటి ప్రాంతాలకు ప్రయాణ సదుపాయం లభించనుంది.

ఆగే స్టేషన్లు.. టైమింగ్స్ పై క్లారిటీ ఎప్పుడు?

Advertisement

తాజా సమాచారం ప్రకారం.. ఈ రైలు బెంగళూరు నుంచి రాత్రి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ముంబై చేరుకునే షెడ్యూల్‌ చేసినట్లు తెలుస్తోంది. కానీ, రైలు నంబర్లు, బయలుదేరే సమయం, ప్రతి స్టేషన్‌కు చేరుకునే సమయం, హాల్ట్ వివరాలు అధికారికంగా ఖరారయ్యాయకే తెలియనుంది. ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకునే ముందు IRCTC,  భారతీయ రైల్వే అధికారిక ప్రకటనలను పరిశీలించడం మంచిది. ప్రయాణ సమయం కూడా రూట్,  స్టాపులు, ట్రాక్ పరిస్థితులు, రైలు వేగంపై ఆధారపడి ఉంటుంది.

BEML తయారీ.. స్లీపర్ రైలులో ప్రత్యేకతలు..

ఈ రైలు తయారీలో బెంగళూరుకు చెందిన BEML, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కీలక పాత్ర పోషించాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఏసీ బెర్తులు, ఆధునిక భద్రతా వ్యవస్థలు, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కవచ్ లాంటి భద్రతా సాంకేతికతతో పాటు మెరుగైన కోచ్ సదుపాయాలు కూడా ఈ తరహా రైళ్ల ప్రత్యేకతల్లో ఉన్నాయి.

ప్రయాణికులకు మరింత ఉపయోగం..

Advertisement

బెంగళూరు–ముంబై మధ్య ప్రస్తుతం ప్రయాణించే వారికి రాత్రిపూట సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, కుటుంబ ప్రయాణికులకు ఇది ఉపయోగపడవచ్చు. అయితే, ప్రారంభ తేదీ, టికెట్ ధరలు, బుకింగ్ ప్రారంభం, రూట్, కంప్లీట్ టైమింగ్స్ పై త్వరలో రైల్వేశాఖ అధికారిక ప్రకటన చేయనుంది.

Read Also: ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం ఇక 9 గంటలే.. కొత్త వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

Tags

Related News

చేతిలో ఐఫోన్.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని 17 ఏళ్ల బాలుడు బలి!

ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం ఇక 9 గంటలే.. కొత్త వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. వందే భారత్ సహా 42 రైళ్లు రద్దు!

నల్లగొండలో యాక్సిడెంట్లకు చెక్.. నాలుగు లైన్లుగా సాగర్ రోడ్డు విస్తరణ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!

రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Big Stories

Advertisement
×