BigTV English

Mumbai: విషాదం.. క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి..

Mumbai: విషాదం.. క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి..
Mumbai news today

Mumbai news today(Today news paper telugu):

మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ.. 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అందుకు కారణం.. పక్కనే జరుగుతున్న మ్యాచ్ లో బాల్ వచ్చి అతని తలకు బలంగా తగలడమే. మాతుంగాలోని మైదాన్ లో ఈ ఘటన జరిగింది. గాయమైన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందిన వైద్యులు నిర్థారించినట్లు తోటి ఆటగాళ్లు తెలిపారు. అక్కడే ఉన్న మిగతా ఆటగాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. 50కి పైగా వయసున్న వ్యక్తుల కోసం.. కుచ్చివీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్ పేరిట ముంబైలో టీ20 టోర్నమెంట్ జరుగుతోంది.


టోర్నమెంట్ లో భాగంగా సోమవారం 2 మ్యాచ్ లను పక్కపక్క పిచ్ లపై నిర్వహించారు. సమయం ఎక్కువగా లేకపోవడం, ఇతర మైదానాలు అందుబాటులో లేకపోవడంతో ఇలాగే చేయాల్సి వచ్చింది. కానీ.. ఇందులో బాల్ తగిలి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని బాల్ తో కొట్టి చంపలేదని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×