E-Paper
Advertisement

Lal Salaam : సంక్రాంతి పోరుకు రెడీ కాని లాల్ సలాం .. కారణం ఇదేనా ?

Lal Salaam : సంక్రాంతి పోరుకు రెడీ కాని లాల్ సలాం .. కారణం ఇదేనా ?
Advertisement
Lal Salaam

Lal Salaam : రజినీ కాంత్ .. జైలర్ మూవీ సక్సెస్ తో యమ స్పీడ్ మీద ఉన్నాడు ఈ సూపర్ స్టార్. ప్రస్తుతం అతను నటిస్తున్న లాల్ సలాం చిత్రం సంక్రాంతి భరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రజనీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే బడా హీరోల సినిమాలలో “లాల్ సలాం” కూడా ఒకటి అని నిన్నటి వరకు అనుకున్నారు. సినిమా పోస్ట్ ఫోన్ చేసిన విషయాన్ని నిర్మాణ సంస్థ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.

లైకా ప్రొడక్షన్స్ 2024 సంక్రాంతి కి అరుణ్ విజయ్- అమీ జాక్సన్ కాంబోలో వస్తున్న మిషన్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే ఇండైరెక్టుగా లాల్ సలాం రిలీజ్ వాయిదా పడినట్టే కదా. త్వరలో ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. మామూలుగా ఇలా వాయిదా పడినప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు కానీ తలైవా ఫ్యాన్స్ మాత్రం.. ‘నాన్న..సింహం సింగిల్ గానే వస్తుంది ‘ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్, నిరోషాతో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో లాల్ సలాం తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్‌కి చెందిన సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌కి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ముంబయి డాన్ మొయిద్దీన్ భాయ్‌గా రజినీ కాంత్ కనిపిస్తున్నారు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్‌ కూడా బాగా వైరల్ అయింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ కు సంబంధించి షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ పోషించే పాత్ర చిన్నదే కానీ ఈ పాత్రకు రెమ్యూనరేషన్ భారీగా మొక్కిందట. వారం రోజులపాటు ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్నందుకు రజనీకి ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందిందని టాక్.

అప్పుడెప్పుడో వచ్చిన రజనీకాంత్ భాషా చిత్రంలో మాణిక్యం భాషగా రజనీకాంత్ ముంబై డాన్ గెటప్ లో కనిపించి అలరించారు. మళ్లీ తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత ముంబై ని ఏలే డాన్ గా రజిని స్క్రీన్ పై కనిపించబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ ‘వెట్టయన్’మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ తో రజిని మరొక మూవీ చేస్తున్నారు. ఇక లాల్ సలాం కి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×