BigTV English

Dasara 2023 Movie Updates : థియేటర్ లో ఎక్కువసేపు కూర్చోబెట్టడానికి సిద్ధమవుతున్న దసరా ధమాకా చిత్రాలు..

Dasara 2023 Movie Updates : థియేటర్ లో ఎక్కువసేపు కూర్చోబెట్టడానికి సిద్ధమవుతున్న దసరా ధమాకా చిత్రాలు..
Dasara 2023 Movie Updates

Dasara 2023 Movie Updates : ప్రేక్షకులు సినిమా హాల్ కి వెళ్లడం ఒక ఎత్తైతే సినిమా పూర్తి అయ్యేంతవరకు కూర్చోవడం మరొక ఎత్తు . ఇంట్రెస్టింగ్ గా ఉన్న సినిమాలైతే ఎండ్ కార్డ్ ఎప్పుడు పడిందో అర్థం కాదు కానీ కాస్త బోర్ కొట్టిన సరే సినిమా ఎప్పుడు అయిపోతుందబ్బా అనుకోకుండా ఉండరు ప్రేక్షకులు.ఒకప్పుడు సినిమాల నిడివి కనీసం రెండున్నర గంటలు ఉండేది. చాలావరకు సినిమాకి 2 1/2 గంట సమయం అనేది ఒకరకంగా స్టాండర్డ్ రన్ టైమ్ . అప్పట్లో కొన్ని సినిమాలు ఇంకా ఎక్కువ రన్ టైం కూడా కలిగి ఉండేవి. అయితే గత కొద్ది కాలంగా ఎక్కువ ల్యాగ్ లేకుండా సినిమాలను వీలైనంత షాట్ గా లాగిచ్చేస్తున్నారు.


మరీ సాగదీతగా ఉంటాయి అనుకున్న సీన్స్, అనవసరం అనుకున్న సీన్స్ అన్నీ తీసేస్తే సినిమా నిడివి రెండు నుంచి 2 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ మధ్య ట్రెండ్ తిరిగి మారుతుంది. కంటెంట్ ఉంటే చాలు నిడివి పెద్ద సమస్య కాదు అన్న అభిప్రాయం ఎక్కడ చూసినా బలంగా వినిపిస్తోంది. అందుకే అగ్ర తారల సినిమాలు ఎక్కువ నిడివితోనే రిలీజ‌వుతున్నాయి.అర్జున్ రెడ్డి, రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు మంచి ఘన విజయం సాధించడంతో నిడివి అటు ఇటు మూడు గంటలైనా పర్లేదు అన్న ఇంప్రెషన్ బలపడిపోయింది.

మరి ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ రేపు దసరాకు వచ్చే సినిమాలు ప్రేక్షకులను థియేటర్ లో ఎక్కువసేపు కూర్చో పెట్టేటుగా ఉన్నాయి. దసరాకు వస్తున్న పెద్ద హీరోల సినిమాలు అన్ని మూడు గంటల పైనే రన్ టైం కలిగి ఉన్నాయి. మరి ఇంతసేపు ప్రేక్షకులు బోర్ కొట్టకుండా థియేటర్లో కూర్చుంటారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రన్ టైం మూడు గంటల రెండు నిమిషాలట. సినిమా బలమైన కంటెంట్ తో ఉంటే సరే లేకపోతే ఇంత రన్ టైం తట్టుకోవడం కష్టమే.


మరోపక్క ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న లియో మూవీ తెలుగు లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రన్ సుమారు రెండు ముప్పావు గంట‌ల దాకా ఉంది. ఇక దీనితో పాటు బాలయ్య… భ‌గ‌వంత్ కేస‌రి మూవీ నిడివి రెండు గంటల నలభై నిమిషాలకు పైగానే ఉంటుంది. అయితే ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తి కాలేదు కాబట్టి కరెక్ట్ నిడివి ఎంత అనేది స్పష్టత లేదు. సినిమా క్లిక్ అయితే నిడివి సమస్య కాకపోవచ్చు కానీ ఏ మాత్రం సాగదీతగా ఉన్నా అంత సేపు చూడడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు దీని ఇంపాక్ట్ కచ్చితంగా ఆ చిత్రం థియరిటికల్ రన్ పై పడుతుంది. ఈ నెల 20 న లియో, భగవంత్ కేసరి రిలీజవుతుండగా,….నెక్స్ట్ డే టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దసరా విన్నర్ గా ఏ మూవీ నిలుస్తోంది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×