BigTV English

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Matka Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.  ఎఫ్ 3 తరువాత వరుణ్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 20వ శతాబ్దంలో దేశాన్ని కుదిపేసిన మట్కా గ్యాంబ్లింగ్ స్కామ్‌ల ఆధారంగా తెరకెక్కిన మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి నిర్మించారు.


ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షీ చౌదరి నటిస్తుండగా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తుంది. 1958 మరియు 1982 సంవత్సరాల మధ్య జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ ను కూడా క్రియేట్ చేశాయి. ఇకపోతే ఈ చిత్రం నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఐటెంసాంగ్ ను రిలీజ్ చేశారు. నోరా ఫతేహి- ఐటెంసాంగ్  డెడ్లీ కాంబో అని చెప్పాలి.

Ghatikachalam Teaser: మసూద కన్నా ఎక్కువ భయపెట్టేలా ఉందేంటి.. ?


బాహుబలి సినిమాలో మనోహరీ సాంగ్ కే  తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికీ చాలామందికి నోరా పూర్తిపేరు తెలియదు.. మనోహరీ బ్యూటీ అనే పిలుస్తారు. అంతలా  ఆమె తెలుగువారికి  దగ్గర అయ్యింది.  అరే ఇదొక్కటే తెలుగు పాట చేసిందా  నాటే కాదు.. ఆమె తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ కు స్టెప్స్ వేసింది. టెంపర్, ఊపిరి, కిక్ 2, లోఫర్.. ఈ సినిమాల్లో అమ్మడి ఐటెంసాంగ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. వీటి తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన నోరా.. ఇప్పుడు మట్కా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. ఆమె నటించిన స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

లేలే.. లేలే రాజా.. లేత లేత రోజా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం పబ్ లో సాగింది. వరుణ్ తేజ్ యంగ్ గెటప్ లో కనిపించాడు.  జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్.. అప్పటి పబ్ రోజులను గుర్తుకు తెస్తుంది. ఇక భాస్కరభట్ల అందించిన లిరిక్స్ ను ఎంతో హస్కీగా ఆలపించి మత్తెక్కించింది సింగర్ నీతి మోహన్. సాంగ్ మొత్తంలో నోరానే హైలైట్. ఆ అందం, అందాల ఆరబోత.. ఆమె హావభావాలు.. థియేటర్ లో ఈ సాంగ్ కు కుర్రాళ్లు ఫిదా కావడం ఖాయం.

Pawan Kalyan: పవన్ నోట.. బన్నీ మాట.. వారితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

ముఖ్యంగా నోరా హిట్ సాంగ్స్ లిస్ట్ లో లేలే రాజా కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. వరుణ్ ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.. ఈ సాంగ్ కూడా మంచి హైప్ తెచ్చేలానే కనిపిస్తుంది. కేవలం నోరా సాంగ్ కోసమే కాకుండా సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించింది. మరి ఈ సినిమాతో వరుణ్ కు, నోరాకు ఎలాంటి విజయం అందుతుందో చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×