
Urvashi Rautela :బాలీవుడ్ బ్యూటీస్ మెల్ల మెల్లగా దక్షిణాది వైపు, ముఖ్యంగా టాలీవుడ్‌లో యాక్ట్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు నటించారు కూడా. అలాంటి వారిలో రీసెంట్‌గా తెలుగు ఆడియెన్స్‌ని తన గ్లామర్‌తో కట్టి పడేసిన బ్యూటీ ఊర్వశీ రౌతేలా. ఈ అమ్మడు ఈ ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడదే ఊపుతో అఖిల్ అక్కినేని మూవీ ఏజెంట్‌లోనూ నటించింది. అది కూడా ఓ ఐటెమ్ సాంగ్‌లో. అంత వరకు బాగానే ఉంది. అయితే దుబాయ్‌లో తాను సినిమా సెన్సార్ విభాగంలో సభ్యుడినని చెప్పుకునే ఉమైర్ సంధు ఈమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ఈ మధ్య హీరో హీరోయిన్లను టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలపై అభ్యంతరకరమైన రీతిలో ఉమైర్ సంధు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య సెలీనా జెట్లీని అలాంటి కామెంట్స్‌నే ఉమైర్ పాస్ చేశాడు. దానిపై ఆమె తనదైన రీతిలో ఫైర్ అయ్యింది. ఉమైర్, సెలీనా మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఆ ఘటనను మరచిపోక ముందే, ఈసారి ఊర్వశీ రౌతేలాను సెట్స్‌లో అఖిల్ ఏడిపించాడంటూ కామెంట్ చేశాడు. దీనిపై ఊర్వశి ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
‘‘ఇలాంటి పనికి రాని వార్తలను రాసిన వ్యక్తిపై ఇప్పటికే నా లీగల్ టీమ్ పరువు నష్టం దావా వేసింది. ఇలాంటి విషయాల వల్ల నేను, నా కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది’’ అని తెలియజేసింది ఊర్వశీ రౌతేలా. ఊర్వశీ రౌతేలా ఐటెమ్ సాంగ్ చేసిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఇదొక స్పై థ్రిల్లర్. అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
LINK – https://www.instagram.com/p/CrXpAtioJBb/?igshid=ZWIzMWE5ZmU3Zg==