BigTV English

Lokesh Kanagaraj: కూలి సినిమా కోసం బాలీవుడ్ బిగ్ స్టార్ ను లైన్ లో పెట్టిన లోకేష్

Lokesh Kanagaraj: కూలి సినిమా కోసం బాలీవుడ్ బిగ్ స్టార్ ను లైన్ లో పెట్టిన లోకేష్

Lokesh Kanagaraj: సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో కూడా అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో రజినీకాంత్. అయితే వరుసగా డిజాస్టర్లు పడుతూ సతమతమవుతున్న తరుణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రజనీకాంత్ స్వాగ్ ఆటిట్యూడ్ స్టైల్ ని అద్భుతంగా వాడి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు నెల్సన్.


ఈ సినిమాతో నెల్సన్ కూడా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. కొలమావు కోకిల సినిమాతో దర్శకుడుగా పరిచయమైన నెల్సన్ ఆ తర్వాత వరుణ్ డాక్టర్ సినిమాతో మంచి పేరు సాధించి 100 కోట్ల మార్కెట్లోకి చేరిపోయాడు. ఆ తర్వాత ఏకంగా తలపతి విజయ్ సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. తళపతి విజయ్ హీరోగా చేసిన బీస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో చాలామంది నెల్సన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జైలర్ సినిమాతో అందరికీ సమాధానం ఇచ్చాడు నెల్సన్.

ఇకపోతే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కూలీ అనే ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పైన అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు లోకేష్. ఇంతకుముందు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా కూడా అదే రేంజ్ వీడియోని రిలీజ్ చేశాడు. మలయాళం సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సౌబిన్ సాహిర్. ఈ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు సౌబిన్. ఈ సినిమా కోసం చాలామంది స్టార్ కాస్ట్ రంగంలోకి దిగారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలానే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మామూలుగా ఇంతమంది స్టార్ కాస్ట్ ను డీల్ చేయడమనేది కష్టతరమైన పని. కానీ లోకేష్ కనగరాజ్ వీరందరినీ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పొచ్చు. ఇదివరకే లోకేష్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్స్ ని అద్భుతంగా డీల్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక కూలి సినిమా కూడా అదే మాదిరిగా బ్లాక్ బస్టర్ అవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు లోకేష్ చేసిన కొన్ని సినిమాలకు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించాడు అనిరుద్. లోకేష్ తీసిన కొన్ని సీన్స్ కు అనిరుద్ ఇచ్చిన బాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×