Lokesh Kanagaraj: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఇప్పుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ ఒకరు. మా నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు లోకేష్. ఈ సినిమాను తెలుగులో నగరం పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ రెజీనా కసాండ్రా కలిసిన నటించారు. ఇకపోతే ఫస్ట్ సినిమా తోనే టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు లోకేష్. మొదటి సినిమాకే లోకేష్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
ఖైదీ సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత ఏకంగా మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. తలపతి విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కలిసి నటించిన సినిమా మాస్టర్. సంక్రాంతి కానుక విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. ఈ సినిమాలో విజయ్ కి లోకేష్ రాసిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఆ కేరక్టరైజేషన్ కూడా చాలామంది ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా విక్రమ్. కమలహాసన్ తో లోకేష్ సినిమా అన్నప్పుడు చాలామందికి అంచనాలు విపరీతంగా పెరిగాయి. కమల్ తో సినిమా అన్నప్పుడు ఇదివరకే కమల్ చేసిన విక్రమ్ సినిమా రిఫరెన్స్ గా తీసుకొని ఒక కథను సిద్ధం చేశాడు లోకి. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కమల్ హాసన్ సినిమాల్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఒక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో కమల్ హాసన్ తో సినిమా చేసినప్పుడు ఆయన విక్రమ్ సినిమా ఆధారంగా సీక్వెల్ రాశారు అలా రజినీకాంత్ సినిమా చేసినప్పుడు ఏ సినిమాకి సీక్వెల్ రాయాలనుకుంటున్నారు అని లోకేష్ ను అడిగారు. లోకేష్ దానికి సమాధానంగా దళపతి సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తాను అంటూ తెలిపాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సినిమాకి లోకి లాంటి దర్శకుడు సీక్వెల్ రెడీ చేస్తాను అని చెప్పాడంటే ఆ ఊహ చాలా బాగుంది. ఒకవేళ అది నిజమైతే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ చూడబోతున్నాం.
Also Read : Director Bucchibabu : రామ్ చరణ్ గారు ఇరగకొట్టేస్తున్నారు