IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బెన్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా {IND vs AUS} మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ మూడో టెస్టులో {IND vs AUS} తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులకు ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 48 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. ఈసారి కూడా మిచెల్ స్టార్క్ కే తన వికెట్ ని పారేసుకున్నాడు.
Also Read: Bumrah: బుమ్రాకు ఘోర అవమానం.. కోతి జాతి అంటూ మహిళా కామెంటేటర్ కామెంట్స్!
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన గిల్ (1) ఒక్క పరుగుతోనే పెవిలియన్ చేరాడు. ఇక అనంతరం విరాట్ కోహ్లీ కూడా మరోసారి తన ఫామ్ లేమిని కొనసాగించాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. జోష్ హెజిల్ వుడ్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ అవతల పడ్డ బంతిని ఆడబోయి వికెట్ కీపర్ అలెక్స్ కెరీకి దొరికిపోయాడు. ఒక్క పెర్త్ టెస్ట్ {IND vs AUS} లోనే సెంచరీ తో అదరగొట్టిన కోహ్లీ.. ఆ తర్వాత మళ్లీ పాత బాటలోకి వచ్చేసాడు. అడిలైడ్ టెస్ట్ లో విఫలం అయ్యాడు.
ఆ తరువాత గబ్బా టెస్ట్ {IND vs AUS} లోను దారుణమైన ఆటతీరుతో నిరాశపరిచాడు. ఈ మూడవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. పదే పదే ఒకే తప్పు చేస్తూ వికెట్ పారేసుకోవడం చర్చలకు దారితీస్తోంది. చాలామంది బ్యాటర్స్ ఆఫ్ స్టాంప్ కి అవతల పడిన బంతిని వెంటాడి అవుట్ కావడం సాధారణమే. కానీ కోహ్లీ మాత్రం ఈ బంతులకు అవుట్ అవ్వడం ఓ అలవాటుగా మారిపోయింది. ఈ టెస్ట్ {IND vs AUS} లోని తొలి ఇన్నింగ్స్ లో కూడా కోహ్లీ అదే తరహాలో అవుట్ అయ్యాడు.
Also Read: Sanjiv Goenka: ఢిల్లీ కుట్రలు… పంత్ కు ఎక్కువ ధర పెట్టెలా చేశారు.. భారీ నష్టాల్లో ?
ఇలాంటి బంతులకు కవర్ డ్రైవ్స్ తో ఎన్నో భారీ పరుగులు రాబట్టాడు కోహ్లీ. అయితే కావాలనే కోహ్లీని రెచ్చగొట్టి హెజిల్ ఉడ్ అవుట్ చేశాడు. దీంతో కోహ్లీ ఓపికగా, కూల్ గా ఆడి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్ స్టంప్ డెలివరీస్ బలహీనత నుంచి కోహ్లీ బయటపడకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇక 48 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది భారత జట్టు. అయితే ఈ మూడవరోజు {IND vs AUS} ఆటకి వరుడు మరోసారి ఆటంకం కలిగించాడు. స్టార్క్ 2, హెజిల్ వుడ్ ఒక వికెట్ తీశారు. ఇక భారత బౌలింగ్ లో.. బుమ్రా ఆరు వికెట్లతో రాణించగా.. సిరాజ్ 2, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ చేరో వికెట్ తీసుకున్నారు.