Director Bucchibabu: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తన కెరియర్ లో ఎన్నో ప్రత్యేకమైన సినిమాలు తీస్తూ నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సుకుమార్ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సుకుమార్ సినిమా ఫెయిల్ అయినా కూడా ఆ సినిమాకు ఒక డిగ్నిటీ ఉంటుంది. కమర్షియల్ గా వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు కానీ ఇప్పటికీ ఆ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుకుమార్ దగ్గర పని చేసిన చాలామంది దర్శకులు అయ్యారు. ముఖ్యంగా బుచ్చిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దగ్గర చదువుకొని ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసే ఇప్పుడు డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. ఈ సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తానని పలు రకాలు కథనాలు వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ కాస్త రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది. లేకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ ఉత్తరాంధ్ర మాండలీకం మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదివరకే గోదావరి యాసతో రంగస్థలం సినిమాతో చరణ్ ఆకట్టుకున్నాడు.
ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. దీని గురించి అదిరిపోయి అప్డేట్ ఇచ్చాడు బుచ్చిబాబు. ఉపేంద్ర నటించిన ఒక సినిమా ఈవెంట్ కి హాజరయ్యాడు బుచ్చి. అక్కడ మాట్లాడుతూ ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను. చాలా బాగా షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ గారు ఇరగ్గొట్టేస్తున్నారు అంట చెప్పుకొచ్చాడు. బుచ్చి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి అని చెప్పాలి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ అదే నిజమైతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. ఇది కూడా అదే మాదిరిగా సక్సెస్ అవుతుంది. అయితే రంగస్థలం సినిమాలో బుచ్చిబాబు పాత్ర చాలా ఉంది. మరి తన సినిమాలో చరణ్ ని ఏ మేరకు చూపిస్తాడు అని చాలా మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
Also Read : Allu Arjun : ఆ కుటుంబాన్ని కలవాలని ఎదురుచూస్తున్నాను