BigTV English

Liquor Sales In Telangana: ఇదేందయ్యా ఇది.. తెగ తాగేస్తున్న మందుబాబులు.. దసరాకు ముందే జోరందుకున్న మద్యం విక్రయాలు

Liquor Sales In Telangana: ఇదేందయ్యా ఇది.. తెగ తాగేస్తున్న మందుబాబులు.. దసరాకు ముందే జోరందుకున్న మద్యం విక్రయాలు

Liquor Sales In Telangana: తాగుదాం.. తాగి ఊగుదాం.. ఎంజాయ్ చేద్దాం.. అనే రీతిలో ఉన్నట్లుంది మందుబాబుల హవా. అయితే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జోరందుకున్న మద్యం విక్రయాలు చూస్తే.. ఈ మాట చెప్పక మానరు. ఏపీలో ఎక్సైజ్ శాఖకు కొత్త మద్యం విధానంతో కోట్ల ఆదాయం వస్తుంటే.. తెలంగాణలో కూడా ఎక్సైజ్ శాఖకు ఆదాయమే ఆదాయం వస్తోంది. కేవలం 9 రోజుల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం చూస్తే మందుబాబులకు జేజేలు పలకాల్సిందే. అసలే దసరా నగరాలు ఖాళీ బాట పట్టాయి. గ్రామాలు సందడిగా మారాయి. ఎక్కడ చూసినా బంధువుల అనురాగాలు, ఆప్యాయతలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక స్నేహితుల గురించి చెప్పనక్కర్లేదు.


ఇలాంటి పండుగ వాతావరణంలో ఎంజాయ్ ఉండాల్సిందే. ఆ ఎంజాయ్ మెంట్ లో కొందరు మద్యం వరకు కూడా వెళ్తారు. అలాగే అసలే సందడి సందడిగా ఉన్న వాతావరణంలో మందుబాబులకు చుక్క పడాల్సిందే. లేకుంటే చల్లని బీరైనా జర నోట్లో పడాల్సిందే. అందుకే కాబోలు దసరా పర్వదినం కంటే ముందే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అది కూడా క్యూలైన్లు బార్ షాపుల వద్ద ఉంటున్నాయంటే.. మనం చెప్పవచ్చు.. మద్యం విక్రయాలు ఏ మేరకు సాగుతున్నాయో..

Also Read: Honey Trap: జమీమా గ్యాంగ్ దుర్మార్గపు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. విస్తుపోతున్న పోలీసులు


తెలంగాణ ఎక్సైజ్ శాఖ గల్లా పెట్టె గలగలా అంటోంది. కేవలం 9 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే.. ఇక దసరా పండుగ సమయంలో ఇంతకంటే ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే బ్రాండ్ మద్యం సీసాలు, బీర్లు కొరత లేకుండా ఎక్సైజ్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. బ్రాండ్ మద్యం సీసా లేదంటే.. ఇక మందుబాబుల కామెంట్స్ మామూలుగా ఉండవు.

గతంలో ఏకంగా పలువురు మందుబాబులు బీర్లు బ్రాండెడ్ లేవంటూ ఎక్సైజ్ శాఖకు వినతులు అందజేశారు. అంతేకాకుండా.. తాగుబోతుల సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న ఎక్సైజ్ శాఖ నిల్వలు పెంచింది. అయితే ఈ సారి దసరాకు ముందుగానే మద్యం కొనుగోళ్లు జోరందుకున్నాయని, ఇక పండుగ సమయంలో రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఇదిఇలా ఉంటే మంచిర్యాలలో దసరా సంధర్భంగా వెరైటీ లక్కీడ్రా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక్కడ లాటరీలో పేరు వస్తే చాలు.. బ్రాండెడ్ మద్యం సీసాలను అందించనున్నట్లు ప్రకటించారు. దీనితో మద్యం ప్రియులు అధికసంఖ్యలో ఈ లాటరీలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏదిఏమైనా పండుగల సీజన్ కాబట్టి.. మద్యం విక్రయాలు జోరందుకోవడంతో.. ఎక్సైజ్ శాఖ ఆదాయంపై దృష్టి పెట్టింది.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×