Game Changer : ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ రిలీజ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలింది. అయితే ఈ క్రమంలోనే తాజాగా బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ ఏకంగా తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి కంప్లైంట్ చేసింది. మరి ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ అయితే వీళ్ళకి ఏంటి సమస్య? ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి సడన్ గా మూవీ రిలీజ్ కి ముందు ఇలాంటి కంప్లైంట్ ఎందుకు చేశారు? అంటే… దానికి కారణం శంకర్ (Shankar).
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా మూడేళ్ల పాటు నిర్మాణ దశలోనే ఉంది. ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతుందని సంబర పడుతుంటే, అంతలోపే లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ అడ్డు పడింది. శంకర్ దర్శకత్వంలో రూపొందాల్సిన ‘ఇండియన్ 3’ (Indian 3) మూవీ పూర్తయ్యే దాకా, ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ అవ్వకూడదు అని కంప్లైంట్ చేసింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు ఇప్పటికే తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వెళ్లి కంప్లైంట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ వివాదంపై నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇక శంకర్ వర్సెస్ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) మధ్య సమస్య ఏంటంటే… గత ఏడాది రిలీజ్ అయిన ‘ఇండియన్ 2’ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘ఇండియన్ 2’ మూవీని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ కి భారీ నష్టాలు వచ్చాయి. అయితే ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే డైరెక్టర్ శంకర్ పార్ట్ 3ని కూడా పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 3కి సంబంధించి ఒక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.
అయితే ‘ఇండియన్ 2’ రిజల్ట్ చూశాక పార్ట్ 3లోని కొన్ని సీన్స్ ని రీషూట్ చేయాలని డైరెక్టర్ శంకర్ డిసైడ్ అయ్యారట. కానీ దానికి సుమారుగా 80 కోట్ల వరకు ఖర్చవుతుంది అంటూ లెక్కల్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ముందు పెట్టారట. ఇక ఇందులో 30 కోట్ల వరకు శంకర్ రెమ్యూనరేషనే ఉందని టాక్. అయితే దీనికి లైకా ప్రొడక్షన్స్ వారు నో చెప్పారట. అసలే ‘ఇండియన్ 2’ మూవీ ఘోర పరాభవం తర్వాత భారీ నష్టాలను ఎదుర్కొంటున్న లైకా ప్రొడక్షన్స్… శంకర్ రెమ్యూనరేషన్ తప్ప నిర్మాణ ఖర్చులు మాత్రమే ఇస్తామని అన్నారట. అలా సినిమాను పూర్తి చేసి, ‘భారతీయుడు 3’ని రిలీజ్ చేయమని కండిషన్ పెట్టారట. కానీ దానికి శంకర్ ఒప్పుకోకపోవడంతో మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే లైకా ఏకంగా తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి వెళ్లి తమిళనాడులో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ ని ఆపాలని కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది.