E-Paper
Advertisement

Preeti Amin: చక్రవాకం సీరియల్ హీరోయిన్ స్రవంతి గుర్తుందా.. ఇప్పుడెలా మారిపోయిందో చూడండి

Preeti Amin: చక్రవాకం సీరియల్ హీరోయిన్ స్రవంతి గుర్తుందా.. ఇప్పుడెలా మారిపోయిందో చూడండి
Advertisement

Preeti Amin: ఎందుకో నాకు ఈ ఆశలు.. మనసా.. మనసా నువ్వు పాడలేవులే.. మాట్లాడలేవులే అంటూ ఒకప్పుడు ప్రేక్షకుల నోటి నుంచి వచ్చిన ఒకే ఒక పాట ఇదే. సాధారణంగా కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఎన్ని ఏళ్లు అయినా మర్చిపోరు. అలాగే కొన్ని సీరియల్స్ ను కూడా ప్రేక్షకులు మర్చిపోరు.. మర్చిపోలేరు. అలాంటి మర్చిపోలేని సీరియల్స్ లో చక్రవాకం ఒకటి. మంజుల నాయుడు  దర్శత్వం వహించిన ఈ సీరియల్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. మహిళలే కాదు పురుషులు కూడా టీవీలకు అతుక్కుపోయి ఈ సీరియల్ చూసేవారంటే అతిశయోక్తి కాదు.

ఇంద్ర, స్రవంతి కాలేజ్ టైమ్ లో ప్రేమించుకుంటారు. కానీ, వారి ప్రేమకు పెద్దవాళ్ళు  ఒప్పుకోరు. స్రవంతికి వేరే వాడితో పెళ్లి చేసేస్తారు. అతడు మంచివాడు కాదు. ఇక స్రవంతికి పెళ్లి అయ్యిందని ఇంద్ర ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఇక ఇంకోపక్క ఇంద్రమారడాలు గాయత్రీ ఎలాగైనా బావను పెళ్లాడాలని స్రవంతిని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది.  మరి స్రవంతి భర్త  నుంచి విడిపోయి ఇంద్రను కలిసిందా.. ? వారి ప్రేమ గెలిచిందా.. ? గాయత్రీ పగ ఎక్కడివరకు వెళ్ళింది అనేది సీరియల్ కథ.

Advertisement

Chiranjeevi: గేమ్ ఛేంజర్.. చిరంజీవి రివ్యూ ఇదే

ఇక ఇంద్ర పాత్రలో ఇంద్రనీల్ నటించగా.. స్రవంతి పాత్రలో ప్రీతి అమీన్ నటించింది.  ప్రీతి.. అప్పట్లో హీరోయిన్లు కూడా అంత అందంగా ఉండరేమో అనిపించేంత అందం ఆమె సొంతం. కళ్ల నిండా కాటుక పెట్టుకొని.. జడనిండా పూలు పెట్టుకొని అచ్చ తెలుగు అమ్మాయిలా  కనిపించేది. ఇక ప్రీతికి అందం అంటే ఆమె ముక్కుపుడక. సీరియల్ హీరోయిన్ అయినా.. సినిమా హీరోయిన్ లా ఉండే ప్రీతికి అప్పట్లోనే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ ఆమెకు ఎంతో  మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది.

Advertisement

ఇక ఈ సీరియల్ తరువాత ఒకటి రెండు సీరియల్స్ లో నటించింది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా మెరిసింది. ఇక ఆ తరువాత ఉన్నట్టుండి ఆమె ఇండస్ట్రీ నుంచి దూరమైంది. అసలు ఆమె ఎక్కడ ఉంది..? ఏంటి అనే విషయం కూడా  ఎవరికి తెలియదు. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిందని మాత్రమే వార్తలు వచ్చాయి. ఇక చాలా గ్యాప్ తరువాత ప్రీతి మళ్లీ బుల్లితెరపై ప్రత్యేక్షమయ్యింది. మా సంక్రాంతి వేడుక అనే ఈవెంట్ లో ప్రీతి రీఎంట్రీ ఇచ్చింది. ఆ ఈవెంట్ మొత్తానికి  ఆమె హైలైట్ గా మారింది.

Balagam Venu: ఆ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకున్నా.. బలగం డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

చక్రవాకం సీరియల్ లో ఎలా అయితే ఉందో.. ఇప్పటికే అంతే అందంగా కనిపిస్తుంది. కొద్దిగా ముఖం బొద్దుగా అయినా బరువు పెరగకుండా మరింత అందంగా కనిపించింది. ఈ షోలో ఆమె తాను ఇప్పటివరకు రీఎంట్రీ ఎందుకు ఇవ్వలేదో చెప్పుకొచ్చింది. మీ కోసం అంతమంది ఫ్యాన్స్  వెయిట్ చేస్తుంటే..  ఫ్యాన్స్  కోసం ఎప్పుడు రావాలనిపించలేదా.. ? అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ప్రీతి మాట్లాడుతూ.. ” ఇంకా జనాలు నన్ను గుర్తుపడతారని నేను అనుకోలేదు” అని సమాధానమిచ్చింది.

ఇక ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది.  ప్రీతిని ఇన్నాళ్లకు మళ్లీ చూడడం ఆనందంగా  ఉందని, చక్రవాకం సీరియల్ మళ్లీ రీ రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇకనైనా ప్రీతి  సీరియల్స్ లో తన రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×