BigTV English

 L&T Chairmen comments : ఆదివారం సెలవు ఎందుకు.. మీ భార్యల్ని చూస్తూ ఎంత సేపు కూర్చుంటారు..

 L&T Chairmen comments : ఆదివారం సెలవు ఎందుకు.. మీ భార్యల్ని చూస్తూ ఎంత సేపు కూర్చుంటారు..

 L&T Chairmen comments : ఇటీవల దేశంలో ఉద్యోగస్తుల పనిదినాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. దేశం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే.. అధిక పని గంటలు కష్టపడాలంటూ కొన్ని సంస్థల అధిపతులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి వారానికి 70 పని గంటలు ఉండాలని అభిప్రాయపడగా.. ఇప్పుడు ఎల్ అండ్ టీ సంస్థ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఏకంగా వారానికి 90 పని గంటలు ఉండాలని వ్యాఖ్యానించారు. అసలు ఆదివారాలు సెలవు ఎందుకు అని ప్రశ్నించారు. ఈయన వ్యాఖ్యాలు ఇప్పుడు.. దేశంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.


పెరుగుతున్న పని ఒత్తిడి, భారంతో ఉద్యోగులు.. వారి వ్యక్తిగత జీవితాన్నికోల్పోతున్నారంటూ కొందరు అంటుండగా.. అసలు వారంలో సెలవు అంటూ లేకుండా కష్టపడాలంటూ పిలుపునిస్తున్నారు కొందరు ఛైర్మన్లు. ఇటీవల.. ఓ వీడియోలో ఎల్ అండ్ టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ SN సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఉద్యోగులను ఆదివారాల్లో పని చేయాలని, వారానికి 90 గంటలు కష్టపడాలంటూ చెప్పారు.

అంతే కాదు..  “మీరు ఇంట్లో కూర్చొని ఏమి చేస్తారు? మీరు మీ భార్యను ఎంతసేపు అలానే చూస్తూ కూర్చుంటారు?. భార్యలు తమ భర్తలను ఎంతసేపు తదేకంగా చూస్తూ.. కూర్చుంటారు.? త్వరగా ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. మీతో ఆదివారాలు పని చేయించలేకపోతున్నందుకు నిజంగా బాధపడుతున్నా” అని వ్యాఖ్యానించారు. నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను.. కాబట్టి మిమ్మల్ని ఆదివారాల్లో పని చేయించగలిగితే నేను సంతోషిస్తాను అని అన్నారు.


వారానికి 90 గంటల పాటు పని, ఆదివారం సెలవునూ వదిలేయాలని ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి చిన్నచిన్న ఉద్యోగుల వరకు.. సుబ్రహ్మణ్యన్ మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు.

వారానికి 90 గంటల పని విధానంపై.. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గొయెంకా (Harsh Goenka) స్పందించారు. ‘ఇది వినాశనానికే గానీ.. విజయానికి కాదు’ అంటూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘వారానికి 90 గంటల పనా? సండేను సన్‌-డ్యూటీ అని.. ‘డే ఆఫ్‌’ను ఓ ‘ఊహాజనిత భావన’ అని ఎందుకు మార్చకూడదు అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

కష్టపడి తెలివిగా పని చేయడంపై తనకు నమ్మకం ఉందన్న హర్ష గోయెంకా.. జీవితాన్ని శాశ్వతంగా ఆఫీసు షిప్టుగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే విజయం రాదని అన్నారు. ఉద్యోగం – వ్యక్తిగత జీవితం సమతుల్యత ఉండాలని అన్నారు. అది ఆప్షన్ కాదని, అది జీవితానికి చాలా అవసరం అని అన్నారు. ‘వర్క్‌ స్మార్ట్‌ నాట్‌ స్లేవ్‌’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేశారు.

ఎల్ అండ్ టీ ఛైర్మన్ కామెంట్లపై బాలివుడ్ సెలబ్రెటీలు కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై దీపికా పదుకొణె (Deepika Padukone) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ ఉన్నత సంస్థలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యాలు చేయడాన్ని తాను నమ్మలేకపోతున్నా అని కామెంట్ చేసిన దీపికా.. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలతో తాను ఆశ్చర్యపోతున్నా అని అన్నారు. ఇదే వివాదంపై తన అభిప్రాయాన్ని పంచుకున్న  భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్‌ గుత్తా జ్వాలా (Gutta Jwala) సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. మానసిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వంటి విషయాలపై పట్టింపు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అలాగే.. తన పోస్టులో స్త్రీలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహించారు.

Also Read : నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయి.. తొలిసారి ప్రధాని పాడ్ కాస్ట్.. వీడియో వైరల్

వీరే కాదు.. సామాన్య నెటిజన్లు సైతం సుబ్రహ్మణ్యన్ కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సంస్థ అధిపతిగా ఉద్యోగుల నుంచి శ్రమ దోపిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. తన రిటైర్మెంట్ రోజు తీసుకెళ్లే డబ్బులు, తన వార్షిక జీతం వంటి వివరాలను తెలుపుతూ.. ఓ ఉద్యోగి తన జీవితాంతం ఎంత కష్టపడినా.. ఆ మేరకు సంపాదించుకోలేరని అంటున్నారు. అలాంటిది.. కోట్లకు కోట్లు జీతాలుగా, ఇతర బెనిఫిట్ల రూపంలో తీసుకుంటూ.. చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల ఈ విధమైన కామెంట్లు సహించలేనివి అంటున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×