Madhavan..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను తప్పుదోవ పట్టించడానికి కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక అవాస్తవ ప్రచారం నటుడు మాధవన్ (Madhavan) పై జోరుగా సాగుతున్న వేళ.. హీరో స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా ఆన్లైన్ వేదికగా..” యువతులకు మాత్రమే మాధవన్ సందేశాలు పంపుతున్నారు” అంటూ ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలను ఆకర్షించేలా ఆయన మెసేజ్లు పంపిస్తున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి విషయాలు జోరుగా వైరల్ అవుతున్న నేపథ్యంలో వీటిపై స్పందించారు మాధవన్. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇవన్నీ అసత్యాలేనని తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని, అసలు ఇలాంటి వార్తలు పుట్టుకు రావడానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు మాధవన్..
అసత్య ప్రచారాలపై స్పందించిన మాధవన్..
మాధవన్ మాట్లాడుతూ.. ” సాధారణంగా నా బిజీ షెడ్యూల్ కారణంగా నేను ఆన్లైన్ తక్కువగా ఉపయోగిస్తాను. నా అభిమానులకి కూడా నేను త్వరగా రిప్లైలు ఇవ్వను. అయితే కొంతకాలం క్రితం ఇన్స్టా లో నాకు ఒక అమ్మాయి సందేశం పంపించింది. నేను నటించిన ఒక సినిమా గురించి ఆమె వివరణాత్మకంగా కూడా మెసేజ్ పంపింది.ఆ మెసేజ్ లో ఆ అమ్మాయి..” సర్ మీరు అంటే మాకు ఎంతో గౌరవం. మీరు నటించిన ప్రతి సినిమా కూడా చూస్తాము. ముఖ్యంగా ఆ సినిమా చూశాను. అది నాకు ఎంతో నచ్చింది. మీరు అద్భుతమైన నటుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో మీ నటన చాలా బాగుంది. నాలో ఎంతో స్ఫూర్తి నింపారు” అని ముద్దులతోపాటు హార్ట్ ఏమోజీ ను కూడా జత చేసింది. ఆమె అంతలా అభిమానం చూపింది కాబట్టే స్పందించకపోతే బాగోదు అని నేను కూడా..”థాంక్యూ సో మచ్.. గాడ్ బ్లెస్ యూ ” అంటూ రిప్లై ఇచ్చాను.
ఆ అమ్మాయి వల్లే ఇదంతా అంటున్న మాధవన్..
“అయితే కొంతమంది ఆకతాయిలు ఆ యువతి తన పోస్టు లోని సగం, నా పోస్ట్ ని కలిపి స్క్రీన్ షాట్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా మాధవన్ నాకు ఈ సందేశం పంపారని కూడా రాసుకుంది. అది చూసిన చాలామంది నేను ఆమెకు ముద్దు, హార్ట్ ఎమోజీలు పంపించానని అనుకున్నారు. ముఖ్యంగా యువతులను మభ్యపెట్టేలా సందేశాలు పంపుతున్నానని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియా వాడకం విషయంలో ఎంతో క్లారిటీతో ఉంటున్నాను” అంటూ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు మాధవన్. ఇక మాధవన్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇది చూసిన నెటిజన్స్ పబ్లిసిటీ కోసం అమ్మాయిలు ఒక స్టార్ హీరో ఇమేజ్ ని వాడుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ మండిపడుతున్నారు.
మాధవన్ కెరియర్..
ఒక మాధవన్ విషయానికి వస్తే… సినీ నటుడిగా , నిర్మాతగా, రచయితగా పేరు దక్కించుకున్న ఈయన.. తన సినీ ప్రయాణంలో దాదాపు రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారంతో పాటు ఏడు భాషా సినిమాలలో నటించిన అతి తక్కువ భారతీయ నటుల్లో ఒకరిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. మొదట సీరియల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన, ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు మాధవన్.