Dreams: కలల శాస్త్రంలో వివిధ రకాల కలల గురించి వివరించబడింది. దేవడు సంతోషంగా ఉన్నాడనడానికి సూచనగా కొన్ని కలలు వస్తాయి. ఇవి శుభ సంకేతాలుగా భావించాలి. రాత్రి నిద్రపోతున్నప్పుడు కలలు సాధారణం. కానీ కలల శాస్త్రం ప్రకారం కలలో ఏదో ఒక జీవిత సంకేతం ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం దేవుడు సంతృప్తిగా ఉన్నాడా లేదా అసంతృప్తిగా ఉన్నడా అని చెప్పడానికి మూడు కలల ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఆ కలలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షం:
కలల శాస్త్రం ప్రకారం కలలో వర్షం కనిపిస్తే దేవుడు మీ పట్ల సంతోషంగా ఉన్నాడని అర్థం. అంతే కాకుండా మీ జీవితంలో జరుగుతున్న అన్ని సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సంక్షోభం పరిష్కరించబడుతుంది. అంతే కాకుండా కొత్త సంపాదనకు కూడా అవకాశాలు కలుగుతాయి.
తెల్ల ఏనుగులు:
కలల శాస్త్రం ప్రకారం కలలో తెల్ల ఏనుగులు చూడటం శుభ సంకేతంగా భావిస్తారు. ఈ సంకేతం సంతోషం, ఆనందం, శ్రేయస్సు , దేవుడి ఆశీర్వాదాలను పొందడాన్ని సూచిస్తుంది. మీ కలలో ఏనుగును చూడటం అంటే మీ జీవితంలో చాలా కాలం పాటు ఆనందం, శ్రేయస్సు వస్తాయని అర్థం.
ఆవు:
కలల శాస్త్రం ప్రకారం కలలో ఆవును చూడటం శుభప్రదం. ఆవును చూడటం వల్ల 33 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలను చూసిన ఫలితం దక్కుతుందట. ఎవరైనా కలలో ఆవును చూసినట్లయితే, దేవుని ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. అలాగే ఈ సంకేతం మీ జీవితంలో కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని సూచిస్తాయి.