BigTV English
Advertisement

Madhavi Latha on Painting: ఆడదాని జననేంద్రియం సుఖానికే కాదు.. నటుడిపై విరుచుకుపడ్డ హీరోయిన్

Madhavi Latha on Painting: ఆడదాని జననేంద్రియం సుఖానికే కాదు.. నటుడిపై విరుచుకుపడ్డ హీరోయిన్

Actress Madhavi Latha Fired on Actor Who Shared the Painting Photo: నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైంది తెలుగమ్మాయి మాధవీ లత. ఈ సినిమా మంచి విజయం అందుకుంటే.. మాధవీకి తిరుగులేదు అనుకున్నారు. కానీ, ఈ అమ్మడు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఇక సినిమాల్లో అడపాదడపా నటిస్తూ రాజకీయాల్లో కనిపించింది. బీజేపీ కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే మాధవీ తనకు నచ్చని విషయం గురించి నిర్మొహమాటంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెను కామెంట్ చేసినా.. లేకపోతే మహిళలపై తప్పుగా మాట్లాడినా విరుచుకుపడిపోతుంది.


తాజాగా ఓ నటుడు ఒక అమ్మాయి పెయింటింగ్ ను షేర్ చేశాడు. ఆ పెయింటింగ్ ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఎన్నో వివాదాలను తీసుకొచ్చి పెట్టింది. నగ్నంగా ఉన్న అమ్మాయి యోనిలో సిగరెట్ పెట్టి కాలుస్తూ ఉన్నట్లు ఉంది ఆ పెయింటింగ్. ఇక ఈ పోస్టర్ ను ఒక నటుడు మళ్లీ షేర్ చేయడంతో మాధవీ ఫైర్ అయ్యింది. ఒక వీడియోలో ఆమె తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంది. “నాకు ఈ పెయింటింగ్ నచ్చలేదు.. ఆడదాని యోని అంటే చాలా మంది కేవలం సుఖ స్థానం అని మాత్రమే అనుకుంటారు.. కానీ అదే యోనిని జననేంద్రియం అని కూడా అంటారు.. అంటే జననానికి కారణమైన స్థానం.. ఇప్పటి వరకు పుట్టిన అవతార పురుషులైనా, జగజ్జెతలైన అక్కడినుండే పుట్టారు.

ఇన్ని యుగాలు, కోటాను కోట్ల సంవత్సరాలైనా చిన్న చీమ నుండి, దేవుళ్ళు దాకా అందరినీ ఈ సృష్టిలోకి తీసుకోచ్చిన మాహా ద్వారమే, మాతృత్వపు మార్గమే ఆ మహాస్థానం.. దాన్ని మర్మ స్థానం అని పిలిచినా అది ముమ్మాటికీ మానవాళి ధన్య స్థానం, పుణ్య స్థానం.. అలాంటి స్థానాన్ని గౌరవించలేని నీచులు, స్త్రీ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి జన్మనిచ్చే, జగతిని పెంచే మహా స్థానానికి మర్యాద ఇవ్వలేని మనిషాసురులను కని లోకంమీదకు వదిలేసిన తల్లులను చూసి స్త్రీ గా సిగ్గు పడుతున్నాను.


Also Read: Heroines: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్స్ ను గుర్తుపట్టారా.. ?

అతి త్వరలో అమ్మతనాన్ని అవమానించే ఈ మనిషాసురులను అంతమోందించే ఆదిశక్తి అవతరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఆడవారి ఆత్మగౌరవం కాపాడడం కోసం వారి కోసం మాట్లాడడం కోసం మనసున్న మగవాళ్ళు వస్తారనే నమ్మకం తగ్గిపోయింది.. ఆఫ్ కోర్స్ సాటి ఆడదాని పైన అసూయతో నిందలు వేసే ఆడవారు కూడా ఉన్న సమాజంలో ఆడవారు కూడా ఉద్దరిస్తారనే నమ్మకం లేదు.. కానీ ఏమీ చేయలేనప్పుడు దేవుణ్ణి తప్ప ఎవరిని అడుగుతాం.. అందుకే భారం అమ్మవారిపై వేయడమే..” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. నిజం చెప్పారు అని కొందరు .. సూపర్ చెప్పారు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×