Big Stories

Virender Sehwag: ఆడితే.. గౌరవం ఆటోమేటిగ్గా వస్తుంది: హార్దిక్‌కి సెహ్వాగ్ సూచనలు

Virender Sehwag: ఐపీఎల్ 2024 సీజన్ లో గొప్ప ఆటగాళ్లున్న జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లడం గగనంగా మారింది. ఆల్రడీ విరాట్ కొహ్లీ ఉన్న ఆర్సీబీ అట్టడుగు స్థానంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు ప్లేఆఫ్ కోసం కాదు, ప్రెస్టేజ్ కోసం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే రీతిలో టీమ్ ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్లు ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా లాటి వాళ్లతో నిండిన ముంబయి ఇండియన్స్ కూడా మ్యాచ్ లు గెలిచేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇప్పటికి 8 మ్యాచ్ లు ఆడి మూడు మాత్రమే గెలిచింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో మాజీ టీమ్ ఇండియా డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యాకి కొన్ని సూచనలు చేశాడు. నువ్వు బ్యాటింగ్, బౌలింగు బాగా చేస్తే, ఆటోమేటిక్ గా నీకు దక్కే గౌరవం అదే దక్కుతుందని తెలిపాడు. నీకు కెప్టెన్ గా ఎవరూ పట్టించుకోవడం లేదంటే కారణం నీ ఆటలోనే ఉందని అన్నాడు. కెప్టెన్ అన్నవాడు ఆడి చూపించాలని అన్నాడు.

- Advertisement -

వాళ్లు బౌలింగు చేయలేక పరుగులిస్తుంటే, ఎలా ఆపాలో నువ్వు చూపాలి. నీ బౌలింగులోనే అందరూ సిక్సర్లు కొడుతుంటే, మిగిలిన వాళ్లు నిన్ను చూసి నవ్వుతారని అన్నాడు. అలాగే బ్యాటింగులో కూడా విఫలమవుతున్నావ్… జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, ప్రాక్టీసు పెంచమని సలహా ఇచ్చాడు. ఓడిపోవడం, గెలవడం పక్కన పెట్టమని, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు గత రెండు సీజన్ల నుంచి కప్ గెలవలేదని గుర్తు చేశాడు.

Also Read: టీ 20 వరల్డ్ కప్‌కు శివమ్‌ను ఎంపిక చేయండి.. అగార్కర్ కు రైనా విన్నపం

కాకపోతే తనవైపు ఎవరూ వేలెత్తి చూపించకుండా, తన ఆట తను ఆడుతూ ఇన్నేళ్లుగా జట్టులో రోహిత్ శర్మ కొనసాగుతున్నాడని గుర్తు చేశాడు. అందుకని నువ్వు అదే చేయాలి, జట్టులో ఎవరూ కలిసిరాకపోతే కెప్టెన్ మాత్రం ఏం చేస్తాడని అంటారు. అటు కెప్టెన్సీలో, ఇటు ఆటపరంగా అన్నింటా విఫలం కావడం, నీ భవిష్యత్తు ఆటపై ప్రభావం చూపిస్తుంది, జాగ్రత్త అని తెలిపాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News