BigTV English

Madhavi Latha: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. యూట్యూబర్ అన్వేష్ పై మండిపడ్డ మాధవి లత..!

Madhavi Latha: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. యూట్యూబర్ అన్వేష్ పై మండిపడ్డ మాధవి లత..!

Madhavi Latha..గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొదలుకొని టాప్ సెలబ్రిటీల వరకు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ.. సొంత లాభం చూసుకుంటున్నారు. కానీ వీటి వల్ల ప్రజలు ఎంతగా ఆర్థిక నష్టం పొందుతున్నారో ఆలోచించడం లేదు. ముఖ్యంగా అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి, అవి రాక ఆత్మహత్యలు కూడా చేసుకున్నవారు ఉన్నారు. ఇక రోజు రోజుకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. దీనికి తోడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిని నమ్మి బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెట్టి.. కోల్పోయిన ఎంతో మంది బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది.


బెట్టింగ్ యాప్ లో ఇరుక్కోవడానికి మూల కారణం అన్వేష్ – మాధవి లత

ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీ కి చెందిన దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అవ్వగా.. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్స్ తో పాటూ పలువురు యూట్యూబర్లపై కూడా కేసు నమోదయింది. అందులో నాని అనే యూట్యూబర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇప్పుడు హర్ష సాయి (Harsha Sai), ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), భయ్యా సన్నీ యాదవ్(Bhaiya Sunny Yadav) ల కోసం గాలింపు చేపట్టారు. ఏ క్షణమైనా వీరిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మరో యూట్యూబర్ అన్వేష్ (Youtuber Anvesh) బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మండిపడుతూ వారిని వ్యక్తిగతంగా దూషిస్తున్న వేళ రంగంలోకి దిగిన ప్రముఖ హీరోయిన్ మాధవి లత (Madhavi Latha).. ఆ వీడియోలతో యూట్యూబర్ అన్వేష్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక వీడియోని కూడా వదిలిన ఈమె అన్వేష్ పై మండిపడుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే.. అంటూ ఇండైరెక్టుగా కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.


ALSO READ:Inaya Sultana: ఇనయా ఏంటి ఇది? పబ్లిక్ ప్లేస్‌లో అలా..

అన్వేష్ పై మండిపడ్డ మాధవి లత..

సోషల్ రెస్పాన్స్ కలిగిన సెలబ్రిటీలలో మాధవీలత కూడా ఒకరు. నిత్యం సామాజికంగా జరిగే అంశాలపై స్పందించే ఈమె.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై కూడా స్పందించింది. ముఖ్యంగా ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై మండిపడుతున్న యూట్యూబర్ అన్వేష్ పై కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మాధవి లత.. ఈమె మాట్లాడుతూ..” ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అని అంటున్నాడో.. అదే వ్యక్తి మీరు కూడా విదేశాలకి వస్తే పాపలతో తిరగవచ్చు. మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయొచ్చు.. అని చెబుతున్నారు. ఇతని మాటలు ఏం నేర్పుతున్నాయి.ఇది ఏమాత్రం కరెక్టు.. ఇప్పుడు ఈ వీడియోను చూసే ఫాలోవర్స్ నన్ను అమ్మనా బూతులు తిడతారు. అయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను నిజాన్ని నిర్భయంగా చెబుతాను. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే.. ఓహో ఫారిన్ కంట్రీస్ కి వెళ్తే మనం కూడా పాపలతో తిరుగొచ్చు కదా.. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు అంత అర్జెంటుగా మనకి డబ్బులు ఎవరిస్తారు. మన దగ్గర కూడా డబ్బు ఉంటే మనం కూడా అలా కంట్రీస్ వెళ్లి పాపతో తిరగవచ్చు. కాబట్టి మనకు ఈజీగా డబ్బు కావాలి. దీంతో ఇంకో ఛానల్ ఓపెన్ చేసి.. బెట్టింగ్ యాప్ లో గేమ్ ఆడితే.. ఈజీగా మనీ వస్తుంది మామా అని అంటాడు. మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బ్రతికేయొచ్చు. వేరే ప్రాంతాలకు వెళ్లొచ్చు. వేరే కంట్రీస్ పాపలతో తిరగవచ్చు అని ఆలోచనలో పడి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెడతాడు. తద్వారా ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరిగిపోతాయి అంటూ అన్వేష్ పై మండిపడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది మాధవి లత. ఇక ప్రస్తుతం మాధవి లత చేసిన కామెంట్లకు చాలామంది ఏకీభవిస్తున్నారు. దీంతో అన్వేష్ పై కూడా చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×