BigTV English

CSK vs RCB: చెన్నై ఫ్యాన్ పరువు తీసిన RCB… విజిల్ లాక్కొని మరి!

CSK vs RCB: చెన్నై ఫ్యాన్ పరువు తీసిన RCB… విజిల్ లాక్కొని మరి!

CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రోజు క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఘనవిజయం సాధించింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రజత్ పటిదార్ సేన 50 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సీఎస్కే ఓటమిపాలై.. ఎల్లో ఆర్మీని నిరాశకు గురిచేసింది.


 

సాధారణంగా చెపాక్ మైదానం స్పిన్ కి బాగా అనుకూలిస్తుంది. ఫార్మాట్ ఏదైనా ఇక్కడ టర్నింగ్ ట్రాక్స్ ఎదురవుతాయి. దీనిని ఉపయోగించుకొని క్వాలిటీ స్పిన్ అటాక్ తో బరిలోకి దిగుతూ.. ప్రత్యర్థులను ఓడిస్తూ వస్తోంది సీఎస్కే. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. బాల్ టర్న్ అయినప్పటికీ ఆర్సిబి బ్యాటర్లు కౌంటర్ ఎటాక్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో పాటు నూర్ అహ్మద్ మీద దాడికి దిగారు.


ఈ ముగ్గురి బౌలింగ్ లో 9 ఓవర్లలో ఏకంగా 95 పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 146 పరుగులు మాత్రమే చేసి.. 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి ఎల్లో ఆర్మీని తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ రెండు జట్లు తలపడితే.. ఆ తర్వాత రోజు సోషల్ మీడియాలో కావాల్సినన్ని ఫన్నీ మూమెంట్స్ కనిపిస్తాయి. ఒకరిని మరొకరు ట్రోల్స్ చేసుకోవడం, ఒకరి చాలెంజ్ ని మరొకరు యాక్సెప్ట్ చేయడం, ఇలా ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజు ఆర్సిబి – సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్ ని ఓ ఆర్సిబి లేడీ ఫ్యాన్, ఓ సీఎస్కే అబ్బాయి పక్కపక్కన కూర్చుని మ్యాచ్ చూశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో టిమ్ డేవిడ్ హైట్రిక్ సిక్సర్లతో మోత మోగించాడు. టీమ్ డేవిడ్ సిక్స్ లు బాదుతుంటే.. డగౌట్ లో ఉన్న విరాట్ కోహ్లీ సైతం సంతోషంతో చప్పట్లు కొట్టాడు. ఇదే సమయంలో కెమెరామెన్ విరాట్ కోహ్లీని చూపించిన తర్వాత, పైన మ్యాచ్ వీక్షిస్తున్న ఈ జంటకి క్లోజ్ అప్ వేశాడు.

 

అందులో సీఎస్కే జెర్సీతో ఉన్న అబ్బాయి మెడలో ఉన్న విజిల్ ని లాక్కున్న ఆర్సిబి ఫ్యాన్ ఐన అమ్మాయి.. విజిల్ ఊదుతూ గోలగోల చేసింది. ఈ క్రమంలో సీఎస్కే విజిల్ వేసిన ఆర్సిబి అమ్మాయికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె విజిల్ వేస్తున్న సమయంలో సీఎస్కే ఫ్యాన్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ వైరల్ గా మారిన వీడియో చూసిన వారు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.

Tags

Related News

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

Big Stories

×