BigTV English

Nithiin : నెరవేరని కల.. నితిన్ భవిష్యత్తు ఏమిటీ?

Nithiin : నెరవేరని కల.. నితిన్ భవిష్యత్తు ఏమిటీ?

Nithiin : టాలీవుడ్ ఓవైపు పాన్ వరల్డ్ దిశగా పరుగులు పెడుతుంటే, మరోవైపు కొంతమంది యంగ్ హీరోలు మాత్రం కంటెంట్ సెలక్షన్ లో ఫెయిల్ అవుతున్నారు. అలాంటి హీరోలలో నితిన్ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఈ హీరో ఖాతాలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. ఎన్ని జానర్లు ట్రై చేసినా హిట్టు మాట దేవుడెరుగు, కనీసం పాజిటివ్ టాక్ కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలోనే నితిన్ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సిన టైం వచ్చేసిందా? అనే  చర్చ మొదలైంది.


నిరాశ పరిచిన ‘రాబిన్ హుడ్’

కరోనా కాలం తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. భాష, ప్రాంతీయ భేదం లేకుండా కేవలం కంటెంట్ ఉన్న సినిమాలకే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ అభిరుచికి తగ్గ కథలను ఎంచుకోవడంలో నితిన్ ఫెయిల్ అవుతున్నాడు. నితిన్ ఖాతాలో ‘భీష్మ’ తర్వాత ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా పడలేదు. 2020లో ‘భీష్మ’ (Bheeshma)తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన నితిన్ అదే జోష్ తో చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ (Robinhood) వంటి సినిమాలు చేశారు. వీటిలో ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే ఇవన్నీ ఒకే జానర్ సినిమాలా అంటే అస్సలు కాదు. కానీ రొటీన్ రొట్టకొట్టుడు కథలు, స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలను నితిన్ ఎంచుకోవడమే ఈ ఫెయిల్యూర్ కి కారణం. అందుకే ఆయన ఫ్యాన్స్ ఇక లాభం లేదు భయ్యా… కంటెంట్ తో పాటు రూటు కూడా మార్చాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తున్నారు.


నితిన్ భవిష్యత్తు ఏమిటీ?

తాజాగా రిలీజ్ అయిన ‘రాబిన్ హుడ్’ మూవీ కూడా ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన వారంతా తలనొప్పి సినిమా అని విమర్శలు చేస్తున్నారు. నితిన్ తో పాటు డిజాస్టర్ ఫేజ్ లో ఉన్న శ్రీలీలకు కూడా ఈ మూవీ రిజల్ట్ షాకింగ్ అని చెప్పాలి. మారుతున్న ట్రెండ్ తో పాటు నితిన్ కూడా కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాల్సిన టైం ఇది. లేదంటే మరికొన్ని రోజుల్లోనే నితిన్ సినిమా వస్తుందని తెలిసినా  ప్రేక్షకులు పట్టించుకోని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.

నితిన్ తర్వాత వచ్చిన యంగ్ హీరోలు సైతం సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నారు. కానీ దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో ఉన్న నితిన్ మాత్రం స్టోరీల సెలక్షన్లో తడబడుతున్నాడు. ఈ బాక్స్ ఆఫీసు రేసులో వెనకబడుతున్నారు. మరి ‘రాబిన్ హుడ్’ ఫెయిల్యూర్ తర్వాత ఈ హీరో తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్నది చూడాలి.

ప్రస్తుతం నితిన్ చేతిలో ‘తమ్ముడు’ అని ఒకే ఒక్క మూవీ ఉంది. ఈ మూవీ కోసం నితిన్ తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ ని, ఆయన టైటిల్ ని వాడుకుంటున్నారు. మరి ‘రాబిన్ హుడ్’ డిజాస్టర్ అయిన  వేళ ఇదైనా వర్కౌట్ అవుతుందా? అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ అండ్ ఎమోషనల్ జానర్ సినిమా. ఇప్పటిదాకా ఇలాంటి కథలు ఎన్నో తెరపైకి వచ్చాయి. మరి నితిన్ ‘తమ్ముడు’ మూవీతోనైనా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తారా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×