E-Paper
Advertisement

Kannappa: చెంచులు చేపట్టిన కత్తులు వాళ్ల విజయాన్ని చెక్కుతాయి.. కన్నప్ప నుంచి కొత్త పోస్టర్

Kannappa: చెంచులు చేపట్టిన కత్తులు వాళ్ల విజయాన్ని చెక్కుతాయి.. కన్నప్ప నుంచి కొత్త పోస్టర్
Advertisement

Madhubala new poster released from Kannappa: ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఏ విషయంలోనూ మేకర్స్ అస్సలు తగ్గడం లేదు. క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్‌గా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసేస్తున్నారు. అంతేకాకుండా సినిమాపై అంచనాలు పెంచేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్‌లు అందిస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలో ఈ టీజర్‌ను రిలీజ్ చేసేముందు.. దీనిని విదేశాల్లో ఓ ఈవెంట్‌లో ప్రదర్శించారు.

Advertisement

అక్కడ ఈ మూవీ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు అప్పట్లో ఓ ట్వీట్ కూడా చేశాడు. తమ సినిమా టీజర్ హాలీవుడ్ ప్రియులకు చాలా బాగా నచ్చిందని.. అందరూ ప్రశంసించడం తనకు సరికొత్త ఉత్సాహాన్ని అందించిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇండియాలో లాంచ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ డూపర్ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్‌తో ట్రీట్ ఇచ్చారు.

Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. ‘కన్నప్ప’ భక్తి చిత్రం ఓ చరిత్ర  

Advertisement

ఈ సినిమా నుంచి మరొక పాత్రను రివీల్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో తమిళ యాక్టర్ శరత్ కుమార్ ఓ పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరొక పాత్రను వదిలారు. ఈ సారి ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాల పాత్రను రివీల్ చేశారు. కన్నప్ప మూవీలో మధుబాల పన్నగ అనే చెంచుల దొరసాని పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

అందులో ఆమె చేత్తో కత్తి పట్టుకుని యుద్దానికి సిద్ధం అన్నట్లు కనిపిస్తుంది. ‘‘చెంచులు చేపట్టిన కత్తులు వాళ్ల విజయాన్ని చెక్కుతాయి.. అడ్డు పెట్టిన డాలులు శత్రు దాడిని అడ్డుకుంటాయి.. మాతృస్వామ్య వ్యవస్థ ఆనవాళ్లు… నారీకోన మహారాణి పన్నగ, ఆమె కుమార్తె… వీరనారి నెమలి, సదా యుద్దానికి సిద్ధం’’ అంటూ ఆ పోస్టర్‌పై రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్ సహా స్టార్ నటీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×