Manchu Vishnu Movie Kannappa Teaser : టాలీవుడ్ హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ తారాగణంతో రానున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ అదిరిపోయేలా ఉందని మేకర్స్ తెలిపారు. ఇందులో మోహన్ బాబు, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా , కన్నప్ప సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
శివుడి ఆశీసులతోనే..
కన్నప్ప కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు.. ఇది ఓ చరిత్ర అని, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నటుడు, నిర్మాత మోహన్ బాబు అన్నారు. శివుడి ఆశీసులతోనే ఈ సినిమా తీశామని, ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కన్నప్ప ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, దూర్జటి మహాకవి ఎలా రాశారు.. శ్రీ కాళహస్తి మహత్యం ఏంటన్నది ఈ సినిమాలో చూపించామన్నారు. వ్యయ ప్రయాసతో నిర్మించామని, దేశంలోని మహానటులను ఈ సినిమాలో తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
ప్రభాస్ కోసం రాసుకున్న కథ…
శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను తీశానని, ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరన్నారు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు.. అన్ని రకాల అంశాలుంటాయన్నారు. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజుతో మాట్లాడామని.. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నామని చెప్పామన్నారు. అయితే ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు ఇచ్చేశారన్నారు.
ఇది నా కల..
ఇది నా కలల సినిమా అని, నా బిడ్డతో సమానమని హీరో మంచు విష్ణు అన్నారు. ఒక నటుడిగా ఈ సినిమా గౌరవాన్ని పెంచుతుందన్నారు. కెరీర్ పరంగా నా జీవితాన్ని మార్చేస్తుందన్నారు. ఈ సినిమా కోసం సినీ పరిశ్రమలో చాలా మంది సాయం చేశారన్నారు. ఇందులో అగ్ర నటీనటులు ఉన్నారని, వాళ్లందరితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు. భక్తుడు కాక ముందు కన్నప్ప ఎలా ఉండేవారో అలా నటించడం సవాల్‌గా అనిపించిందన్నారు.
Tags
Share