BigTV English

Niharika Konidela: ఆ హీరోతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన మెగా డాటర్.. ఇది అస్సలు ఊహించలేదే

Niharika Konidela: ఆ హీరోతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన మెగా డాటర్.. ఇది అస్సలు ఊహించలేదే

Niharika Konidela:మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ అంటే నిహారిక అనే చెప్పాలి. ఒక మనసు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మెగా అనే ఒక బ్రాండ్ తో సక్సెస్ ఫుల్ అవ్వాలనుకుంది. కానీ అమ్మడి నటనకు ఫ్యాన్స్ అంతంత మాత్రం మార్కులే వేశారు. దీంతో ఈ చిన్నది టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఆ తర్వాత సినిమాలకు చెక్ పెట్టి  చైతన్య జొన్నలగడ్డను వివాహమాడింది.


పెళ్లి తర్వాత నిహారిక హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా మారింది.  అంతా బాగుంది అనుకున్న సమయంలో నిహారిక- చైతన్య మధ్య విభేదాలు తలెత్తెడంతో వీరిద్దరూ.. విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల అనంతరం నిహారిక మళ్ళీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి అందులో సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మించడం మొదలుపెట్టింది. ఇక ఈ ఏడాది  ఆ బ్యానర్ నుంచి వచ్చిన కమిటీ కుర్రోళ్లు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

SKN: ఇంకేముంది పిసుక్కోవడమే.. మెగా ఫ్యాన్స్ కు SKN వార్నింగ్.. ?


ఒకపక్క నిర్మాతగా సినిమాలు చేస్తూనే ఇంకొక పక్క హీరోయిన్ గా తన సత్తా చూపించడానికి రెడీ అయింది. ప్రస్తుతం నిహారిక చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగులో వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తుంది.  ఇది కాకుండా  నిహారిక నటిస్తున్న మలయాళ చిత్రం మద్రాస్ కారన్.

మాలీవుడ్ కుర్ర హీరో  షేన్ నిగమ్  హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో షేన్ సరసన నిహారిక హీరోయిన్ గా  నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అద్భుతమైన వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో మాధవన్, షాలిని జంటగా నటించిన సఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Allu Arjun: తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని నాకు తెలియదు.. అందుకే టైమ్ తీసుకున్నాను

సఖి సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ అందరి ఫేవరెట్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో ముఖ్యంగా కాళ్ల చెడుగుడే అనే సాంగ్ ఇప్పటికీ రొమాంటిక్ లవర్స్ కు ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సాంగ్ ను నిహారిక, షేన్ రీమిక్స్ చేశారు. ఇందులో నిహారిక, షేన్ డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో నిహారిక రొమాన్స్ కొంచెం ఘాటుగానే కనిపిస్తుంది. ఇంటిమేట్ సీన్స్ లో కూడా ఆమె నటించిందని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందా.. ? ప్రమోషన్ సాంగ్ నా అనేది తెలియాల్సి ఉంది.

ఇక  ఈ సాంగ్ చూసిన అభిమానులు నిహారిక డాన్స్ కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో మలయాళంలో మెగా డాటర్ పాగా వేస్తుందో.. లేదో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×