Car Catches Fire in Tirumala: శ్రీవారి దర్శనార్థం భక్తులు కారులో తిరుమలకు చేరుకున్నారు. అలా కారు ఆపారో లేదో.. ఒక్కసారిగా మంటలు.. దట్టమైన మంటల ధాటికి స్థానిక భక్తులు సైతం భయాందోళన చెందారు. కానీ శ్రీవారి ఆశీస్సులతో భక్తులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.
కర్ణాటక కు చెందిన పలువురు భక్తులు కారులో శనివారం రాత్రికి తిరుమలకు చేరుకున్నారు. కారు బాలాజీ బస్టాండ్ వద్దకు రాగానే, అక్కడ కారును కొద్దిసేపు నిలిపివేశారు. మరికొద్ది క్షణాల్లోనే కారులో నుండి పొగలు రావడాన్ని స్థానిక భక్తులు గమనించారు. ఈ విషయాన్ని కారు లోపల గల భక్తులకు తెలపడంతో, ఒక్కసారిగా భక్తులు కారులో నుండి హుటాహుటిన దిగారు. అంతలోనే కారు ముందు టైర్లకు మంటలు తీవ్రస్థాయిలో వ్యాపించాయి. ఆ మంటలు అధికమై కారు పూర్తిగా దగ్ధమైంది.
ఈ విషయాన్ని గమనించిన స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను దూరం పంపించారు. అనంతరం ఫైర్ స్టేషన్ సిబ్బంది కారు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తృటిలో తమకు పెను ప్రమాదం తప్పిందని, శ్రీవారి ఆశీస్సులతో తమ ప్రాణాలు కాపాడుకోగలిగినట్లు కర్ణాటక కు చెందిన భక్తులు తెలిపారు.
Also Read: Heart Health: చలికాలంలో గుండె సమస్యలు.. వెల్లులిని ఇలా వాడితే ప్రాణాలు సేఫ్
సుదూర ప్రాంతం నుండి రావడంతో కారు హీటెక్కి, షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది. నిరంతరం రద్దీగా ఉండే బాలాజీ బస్టాండ్ వద్ద కారు ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం అందుకున్న స్థానిక ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్నారు. భక్తులెవరూ కారు వద్దకు వెళ్లకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
తిరుమల బాలాజీ బస్టాండ్ వద్ద కారు దగ్ధం
భారీగా ఎగసిపడిన మంటలు
నీటితో మంటలను ఆర్పిన స్థానికులు
ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది#Tirumala #fireaccident #Bigtv pic.twitter.com/JAnuQ3hJIo
— BIG TV Breaking News (@bigtvtelugu) December 7, 2024