BigTV English
Advertisement

SKN: ఇంకేముంది పిసుక్కోవడమే.. మెగా ఫ్యాన్స్ కు SKN వార్నింగ్.. ?

SKN: ఇంకేముంది పిసుక్కోవడమే.. మెగా ఫ్యాన్స్ కు SKN వార్నింగ్.. ?

SKN: బేబీ సినిమా నిర్మాత SKN గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఆ తరువాత అల్లు అర్జున్ కు పీఆర్ గా పనిచేసి.. చిన్న చిన్న సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ బేబీ సినిమాతో నిర్మాతగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న SKN.. మెగా ఫ్యామిలీకి పెద్ద భక్తుడు అన్న విషయం తెల్సిందే.


ముఖ్యంగా మెగా – అల్లు కుటుంబాల మధ్య ఏదైనా వివాదం తలెత్తి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిస్తే మాత్రం.. SKN  ఫ్యాన్స్ ను ఆపడానికి రెడీగా ఉంటాడు. అల్లు అర్జున్ మీద  మాట కూడా పడనివ్వడు.  ఒకానొక సమయంలో అల్లు హీరోలపై ట్రోలింగ్ జరుగుతుంటే SKN ఒక్కడే సోషల్ మీడియాలో అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. అతనిలోని ఆ స్పిరిట్ నచ్చే బన్నీ.. SKN ను అల్లు కుటుంబంలోకి తీసుకొచ్చాడు. అతనిని పీఆర్ గా మార్చాడు.

Allu Arjun: తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని నాకు తెలియదు.. అందుకే టైమ్ తీసుకున్నాను


ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు SKN ఇలా ఉండడానికి కారణం బన్నీనే అని చెప్పాలి. అందుకే ఎప్పుడు బన్నీకి విశ్వాసంగా ఉంటాడు. ఇక ఈ ఏడాదిలో మెగా – అల్లు కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా  బన్నీ నంద్యాల పర్యటన అటు ఇండస్ట్రీని, ఇటు రెండు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. ఈ ఒక్క ఘటన మెగా – అల్లు ఫ్యామిలీ  ఫ్యాన్స్ ను వేరు చేసింది.  ఈ ఘటనపై మెగా హీరోలు తమదైన రీతిలో స్పందించారు. మెగాస్టార్, పవర్ స్టార్ అయితే అసలు పట్టించుకోనేలేదు.

బన్నీ.. తన ఫ్రెండ్ కోసం మాత్రమే నంద్యాల వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వివాదం పుష్ప 2 మీద ఎఫెక్ట్ పడుతుందని మొదటి నుంచి వినిపించిన మాటనే. కానీ, విచిత్రంగా సీన్ రివర్స్ అయ్యింది. సినిమా రిలీజ్ టైమ్ కు మెగా – అల్లు కుటుంబాలు కలిసిపోయాయి. పరాయివాడు అన్న నాగబాబు పుష్ప 2 సినిమా చూడమని అభిమానులను కోరాడు. అసలు సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేసిన తేజ్.. అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

Sukumar – Devi Nagavalli : జర్నలిస్ట్ దేవి నాగవల్లి కథతో సుకుమార్ సినిమా

ఇక పవన్ కళ్యాణ్.. ఏపీలో పుష్ప 2 టికెట్ రేట్లు పెంచుకోవచ్చని జీవో పాస్ చేశారు. ఇక తాజాగా.. బన్నీ సైతం ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని పిలిచి  థాంక్స్ చెప్పుకొచ్చాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. ఇదేందయ్యా ఇది.. ఇదెక్కడి మార్పు అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సమయంలోనే SKN ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  అఆ సినిమాలో రావు రమేష్, అజయ్ మధ్య జరిగే సంభాషణ వీడియో క్లిప్ ను పోస్ట్ చేశాడు. అందులో ఇప్పుడేం చేద్దాం నాన్న అని అజయ్ అనగా.. ఇంకేముందు పిసుక్కోవడమే అని రావు రమేష్ అంటాడు.  ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్ కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

Allu Arjun: మెగాస్టార్ ని మర్చిపోవడమే కాదు, ఇప్పుడు తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్

చెప్పింది నీ లాంటి వల్లా గురించి… నిన్న వెళ్లినా చిల్లర డిబేట్లకు ఎప్పుడు వెళ్ళకు. వెళ్లినా.. ఫ్యామిలీ హీరోల సినిమాల మీద ఎప్పుడు కామెంట్స్  చేయకు. ఫ్యామిలీ హీరోలే కాదు ఇంకా ఏ ఇతర హీరోల సినిమాలపై కూడా కామెంట్ చేయకండి. ఆన్‌లైన్‌లో ఎదో కొట్టుకున్నారు ఇంక అక్కడితో ఇక్కడితో ఆపేయండి” అంటూ రాసుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను బట్టి SKN మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. వాళ్లు వాళ్లు ఒకటే.. మీరు కొట్టుకోవడం ఆపితే మంచింది అని పద్దతిగా చెప్పాడు అని ఇంకొందరు  కామెంట్స్ చేస్తున్నారు. 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×