BigTV English

Akira, Aadya @ Pawan’s Oath Ceremony: తండ్రి ప్రమాణ స్వీకారానికి అకీరా, ఆద్య.. పవన్‌కు రేణు విషెస్..!

Akira, Aadya @ Pawan’s Oath Ceremony: తండ్రి ప్రమాణ స్వీకారానికి అకీరా, ఆద్య.. పవన్‌కు రేణు విషెస్..!

Akira and Aadya attends Pawan’s Oath Ceremony: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈరోజు ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సినిమా స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లతో పాటు.. ముఖ్య అతిథులు హాజరు కానున్నారు.


కేసరపల్లిలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకారానికి 14 ఎకరాల్లో సభాప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 7 వేలమంది పోలీసులు భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పాస్ ఉన్న వాహనాలను మాత్రమే పార్కింగ్ కు అనుమతిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. విజయవాడ నుంచి కేసరపల్లి వరకూ టీడీపీ శ్రేణులు, జనసైనికులు పండుగ చేసుకుంటున్నారు.

జనసేన పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తొలిసారి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత మెగావారింట జరిగిన సంబరాల వీడియోలు.. నెట్టింట వైరల్ అయ్యాయి. తండ్రి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వెంటే ఉన్నాడు అకీరా నందన్. పిఠాపురం నుంచి మెగావారింటికి, ప్రధానిని కలిసినపుడు కూడా తండ్రి వెనుకే ఉన్నాడు.


Also Read : వారసుడిని మోడీకి పరిచయం చేసిన సేనాని.. ఆ హైట్ ఏంటిరా బాబు

నేడు పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అకీరా నందన్, ఆద్య కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో తన పిల్లలిద్దరూ వాళ్ల నాన్న జీవితంలో అతిముఖ్యమైన రోజున చాలా క్యూట్ గా రెడీ అయ్యారంటూ ఒక వీడియో షేర్ చేసింది రేణుదేశాయ్. వీడియో కాల్ లో తన ఇద్దరు పిల్లలతో మాట్లాడుతున్న ఫొటోలను వీడియోగా షేర్ చేసిన రేణు.. కల్యాణ్ గారికి అభినందనలు అని రాసుకొచ్చారు. ఏపీకి, సొసైటీకి మంచి చేస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by renu desai (@renuudesai)

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×