
Mahesh Babu : మండే వేసవి కాలం వచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేశాయి. ఇదంతా హాలిడేస్ ఎంజాయ్ చేసే మూడ్. సహజంగానే సినీ ఇండస్ట్రీలో విహార యాత్రలు అంటే గుర్తొచ్చేది మహేశ్ బాబు ఫ్యామిలీనే. షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరికితే చాలు.. టూర్. సినిమా షూటింగ్ అయిపోతే చాలు టూర్. చివరికి సినిమా మొదలు పెట్టే ముందు కూడా ఓ టూర్. నిజానికి మిగతా హీరోలకు, ఫ్యామిలీలకు సాధ్యంకానిది ఒక్క మహేశ్ బాబుకే సాధ్యం అవుతోంది. ఈ విషయంలో హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
కాకపోతే… సినిమా షెడ్యూల్ ఉన్నా సరే మహేశ్ బాబు టూర్‌కి వెళ్తున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. మహేశ్ బాబు తీసుకున్న లీవ్స్ కారణంగా.. ఈ సినిమా ఇప్పటికే బాగా ఆలస్యం అయిందనే టాక్ బాగా నడుస్తోంది. త్రివిక్రమే ఓపిక పట్టి.. మహేశ్ బాబు లేని సీన్స్‌ను కంప్లీట్ చేస్తున్నాడట. ఇప్పుడు వరుస షెడ్యూల్స్ జరుగుతూ.. సినిమా షూటింగ్ వేగం పుంజుకుంటోందనగా.. మళ్లీ టూర్‌కు వెళ్లొచ్చాడు మహేశ్. నిజానికి షెడ్యూల్ కంప్లీట్ అయిన తరువాతే వెళ్లాడు. కాని, మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతున్నా సరే.. జాయిన్ కాలేదట. కారణం అడిగితే.. ఎండలు మండిపోతున్నాయ్ అనే సమాధానం వినిపించిందని టాలీవుడ్ టాక్.
మండే ఎండల్లో షూటింగ్ చేయలేక, మహేష్ గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా సమ్మర్ అంటే మహేష్ కు పడదు అనే టాక్ వినిపిస్తోంది. వేసవి వేడి నుంచి తప్పించుకునేందుకు మ్యాగ్జిమమ్ తన సినిమా షూటింగ్స్ వేసవిలో లేకుండా ప్లాన్ చేసుకుంటాడు మహేష్. కాకపోతే, త్రివిక్రమ్ మూవీ ఇప్పటికే ఆలస్యం అవడంతో ఈసారి షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేశాడంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఎండలు కాస్త తగ్గితే మళ్లీ షూటింగ్‌కు వస్తానన్నట్టు మెసేజ్ పెట్టారని చెప్పుకుంటున్నారు.