
Guntur Karam : గుంటూరు కారం.. మహేష్ బాబు ,త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూడవ చిత్రం పై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మొదటి సింగిల్ దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు ఎన్నడూ మహేష్ బాబుని చూడని విధంగా ఈ సాంగ్ లో ఫుల్ మాస్ స్వింగ్ లో చూసి ప్రేక్షకులు ఎంతో ఆనందించారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 12న రావడానికి సిద్ధంగా ఉంది.
ఇంకా ఈ మూవీ నుంచి విడుదల కావాల్సిన సాంగ్స్ నాలుగు దాకా ఉన్నాయి. మొదటి సింగిల్ అందించిన విజువల్ ఫీస్ట్ తో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచిన ఈ మూవీ నుంచి మిగిలిన సాంగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28వ చిత్రం. ఇందులో మొదటగా పూజా హెగ్డే హీరోయిన్గా అనుకున్నప్పటికీ తర్వాత ఆఫర్ శ్రీ లీల చేతికి వెళ్ళింది. ఈ రోజు ట్రైలర్ విడుదలైన ఆదికేశవ చిత్రంలో కూడా శ్రీ లీల, వైష్ణవ తేజ తో హీరోయిన్గా నటిస్తోంది.
మూవీ విడుదల కి గట్టిగా 50 రోజుల సమయం కూడా లేదు. ఇక మూవీ నుంచి వరుసగా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గుంటూరు కారానికి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత నాగ వంశీని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్ లో.. మ్యాడ్ మూవీ సమయంలో సాంగ్స్ ప్రేక్షకులకు చేరువ కావడానికి సమయం సరిపోలేదు.. అదే జరిగి ఉంటే మూవీ మరింత సక్సెస్ఫుల్ అయ్యేది అని మీరు చెప్పారు కదా.. మరి గుంటూరు కారానికి కూడా ఇది వర్తిస్తుందా అని అడిగినప్పుడు నాగ వంశీ తనదైన శైలిలో స్పందించారు.
గుంటూరు కారం చిత్రం నుంచి ఇంకా నాలుగు పాటలు ఉండబోతున్నాయి అని క్లారిటీ ఇస్తూ ఉన్న సమయం లో సాంగ్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సరిపోతుంది అని కూడా అన్నారు. అంతేకాదు ఈ చిత్రంలో పాటలు వచ్చే సంవత్సరం వరకు పడుకునే అంత అద్భుతంగా ఉంటాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇక గుంటూరు కారం సెకండ్ సింగిల్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగిన ప్రశ్నకి వచ్చేవారం ఉంటుంది అని అన్నారు నాగ వంశీ. నెక్స్ట్ విడుదల చేసే సాంగ్ మహేష్ బాబు ,శ్రీ లీల మధ్య మంచి రొమాంటిక్ యాంగిల్ సాంగ్ అయితే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.